Advertisementt

పవన్ కామెడీ చేస్తాడంట...!

Mon 24th Apr 2017 01:26 PM
pawan kalyan,director trivikram srinivas,keerthy suresh,anu emmanuel  పవన్ కామెడీ చేస్తాడంట...!
Pawan Kalyan's doing Comedy...! పవన్ కామెడీ చేస్తాడంట...!
Advertisement
Ads by CJ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్రం మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నారు. ఇప్పటివరకు వీరి కాంబినేషన్ లో వచ్చిన 'జల్సా, అత్తారింటికి దారేది' చిత్రాలు సూపర్ హిట్ అవడంతో ఇప్పుడు ఈ కాంబినేషన్ మీద రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సాఫ్ట్ వెర్ ఇంజినీర్ గా  కనబడతాడని ప్రచారం జరుగుతుంది. ఇక ఈ చిత్రంలో పవన్ కి జోడిగా కీర్తి సురేష్, అను ఇమ్మాన్యువల్ లు మొదటిసారిగా నటిస్తుండగా... సీనియర్ నటి ఖుష్బూ కీలక పాత్రలో నటిస్తుంది.

అయితే త్రివిక్రమ్ - పవన్ చిత్రంలో రొమాన్స్, కామెడీ, యాక్షన్ కలగలిపిన ఈ చిత్రానికి కామెడికే  పెద్ద పీట వేస్తున్నట్లు... ప్రచారం మొదలైంది. సీరియస్ పాయింట్‌కి కూడా కామెడీ కోటింగ్ ఇచ్చి‌ స్వీట్‌గా చెప్పడంలో త్రివిక్రమ్ స్పెషలిస్ట్. ఇక ఈ చిత్రానికి పవన్ చేసే కామెడీ హైలెట్ గా ఉండబోతుందని చెబుతున్నారు. ఇప్పటికే జల్సాలో, అత్తారింటికి దారేది లో పవన్ చేసిన కామెడీ మీకు గుర్తుండే ఉంటుంది. ఇక ఈ చిత్రంలో కూడా పవన్ కామెడీతో పిచ్చెక్కిచ్చేస్తాడన్నమాట.

Pawan Kalyan's doing Comedy...! :

Power Star Pawan Kalyan, Trivikram's combination film shooting is shooting fast.In this movie Pawan as Keerthy Suresh, Anu Emmanuel Starring first time. Pawan Kalyan is also in the film doing comedy

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ