డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ మధ్యన ప్లాపుల బాటలో వెళుతున్నాడు. అయినా కూడా బాలయ్య తో సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడు. అయితే ఆ మధ్యన చిరంజీవితో 150 వ చిత్రానికి డైరెక్టర్ గా పూరికి ఛాన్స్ వచ్చిందని.... చిరుతో పూరి ఆటోజానీ తియ్యబోతున్నాడని తెగ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. కానీ పూరి చెప్పిన కథ నచ్చకో మారే కారణమో తెలియదు గాని అప్పుడు చిరు, పూరీని దూరం పెట్టేశాడు 150 వ చిత్రాన్ని వి.వి వినాయక్ డైరెక్షన్ లో కత్తి చిత్రం చేశాడు. ఇక ఇప్పుడు చిరంజీవి తాజాగా 151 వ చిత్రాన్ని సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' చిత్రాన్ని చేస్తున్నాడు.
అయితే పూరి హీరోకు ఎర వేశాడు ఆ అంటే ఒకపట్ఠానా అంత తేలిగ్గా వదిలేసే రకం కాదు. అందుకే మళ్లీ చిరుకి తగ్గ స్టోరీని తయారుచేసే పనిలో పడ్డాడట. బాలయ్య చిత్రానికి షూటింగ్ గ్యాప్ వచ్చినప్పుడల్లా చిరు కోసం స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో పడ్డాడట. మరి చిరు కూడా మంచి కథతో వస్తే పూరి తో సినిమా చేస్తానని మీలో ఎవరు కోటీశ్వరుడు షో సాక్షిగా చెప్పాడు. మరి పూరి తన స్క్రిప్ట్ తో చిరుని గనక ఇంప్రెస్స్ చెయ్యగలిగితే 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' తరువాత పూరీ డైరెక్షన్‌లో చిరు మూవీ ఉండే అవకాశం ఉందని అంటున్నారు.