Advertisementt

రాజు గారి చేయి పడితే ఇక నో.. డౌట్‌..!

Sun 23rd Apr 2017 06:10 PM
producer dil raju,keerthy suresh,nani,sharwanand,sai pallavi,varun tej,fedha movie  రాజు గారి చేయి పడితే ఇక నో.. డౌట్‌..!
Raju Garu's Involvement?...Then No Need to Bother రాజు గారి చేయి పడితే ఇక నో.. డౌట్‌..!
Advertisement
Ads by CJ

దిల్‌రాజు మంచి అభిరుచి ఉన్న నిర్మాత మాత్రమే కాదు.. మంచి జడ్జిమెంట్‌ ఉన్న ప్రతిభాశాలి కూడా. ఇక ఆయన చిత్రాలలో నటించాలని, ఆయన నిర్మించే చిత్రాలతో అరంగేట్రం చేయాలని, ఆయన చిత్రానికి ఒక్క సినిమా అయినా డైరెక్ట్‌ చేయాలని భావించని వారు ఎవ్వరూ ఉండరు. ఇక ఆయన తన కెరీర్‌లో తన సినిమాలతో ఎంతో మంది హీరోలకు బ్రేక్‌ ఇచ్చారు. బన్నీ నుంచి సాయిధరమ్‌తేజ్‌ వరకు తాజాగా శర్వానంద్‌తో పాటు నానికి పెద్ద హిట్‌ ఇచ్చాడు. 

ఇక ఆయన చిత్రాలలో మితిమీరిన ఎక్స్‌పోజింగ్‌ కూడా ఉండదు. హీరోయిన్లను హోమ్లీగా చూపించేందుకే కష్టపడతాడు. 'ఆర్య నుంచి శతమానం భవతి' వరకు ఆయనది అదే రూట్‌. ఇక 'నేను లోకల్‌'లో కీర్తీసురేష్‌ వంటి హీరోయిన్‌ని తీసుకున్నాడు. తాజాగా అజిత్‌, మణిరత్నం వంటి వారి చిత్రాలలో కూడా కాస్త ఎక్కువగా గ్లామర్‌షో ఉందని తిరస్కరించిన మలయాళ భామ సాయి పల్లవి. ఈ 'ప్రేమమ్‌' బ్యూటీ ఓ తెలుగు డ్యాన్స్‌ ప్రోగ్రాం ద్వారా పాపులర్‌ అయింది. 

కాగా ఆమె సామాన్యంగా ఎవ్వరి చిత్రాలకు ఓకే చెప్పదనే పేరుంది. ఆమె ప్రస్తుతం దిల్‌రాజు నిర్మాతగా శేఖర్‌కమ్ముల వంటి క్లీన్‌డైరెక్ట్‌తో వరుణ్‌తేజ్‌ సరసన 'ఫిదా' చిత్రంలో నటిస్తోంది. తాజాగా దిల్‌రాజు ఆమెకు మరో అవకాశం ఇచ్చాడు. నాని హీరోగా వేణుశ్రీరామ్‌ దర్శకత్వంలో రూపొందనున్న 'ఎంసిఎ' చిత్రంలో ఆమెను ఫైనల్‌ చేశారు. ఈ రెండు చిత్రాలు ఇదే ఏడాది విడుదలయ్యే అవకాశాలున్నాయి. 

Raju Garu's Involvement?...Then No Need to Bother:

Dilraj is not only a good hobby producer but also a good judicial. Malaya Bhama Sai Pallavi, who declined to have glamorous in their films like Mani Ratnam.  Freshly Dilraj give her another chance. Nani is the hero in the film 'MCA' directed by Venu Sri Ram

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ