శంకర్, రాజమౌళి ఇద్దరు దిగ్గజ దర్శకులే. ప్రస్తుతం వాళ్లు తీస్తున్న 'బాహుబలి2, 2.0'లపై దేశ విదేశాల్లో భారీ అంచనాలున్నాయి. ఇక నిర్మాతల పరంగా ఆలోచిస్తే జక్కన్నే శంకర్ కంటే బెటర్ అనిపిస్తోంది. అనుకున్న బడ్జెట్‌లో కాస్త ఎక్కువే అయినా నిర్మాతల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని 'బాహుబలి2'ని చెప్పిన తేదీకి తెస్తున్నాడు. గతంలో పార్ట్1 విషయంలో పలు విడుదల తేదీలు మారిన దృష్ట్యా ఆయన ఆ విమర్శలను ప్రస్తుతం తిప్పికొట్టాడు.
కానీ శంకర్ మాత్రం చేస్తున్న తప్పులనే చేస్తున్నాడు. 'ఐ' విషయంలో ఎంతో ఆలస్యం చేసి ఆస్కార్ రవిచంద్రన్ జీవితంతో ఆడుకున్నాడు. చెప్పిన బడ్జెట్, టైం కంటే ఎంతో ఎక్కువ వృథా చేశాడు. అయినా ఆయన మారలేదు. '2.0'ని దీపావళికి తెస్తామన్నాడు. ఇప్పుడు వీఎఫ్‌ఎక్స్ పనులకు మరింత సమయం కావాలని ఏకంగా వచ్చే ఏడాది జనవరి 25కి పోస్ట్‌పోన్ చేశాడు. ఇక లైకా ప్రొడక్షన్స్ అనుకున్న బడ్జెట్‌కు మించి డబ్బును నీళ్లలా ఖర్చుచేస్తున్నాడు. తన సినిమా గ్రాండియర్‌గా, తాననుకున్నట్లు రావాలని కోరుకోవడంలో తప్పులేదు కానీ ప్లానింగ్ లేకపోవడం, తమిళులకు ఎంతో ముఖ్యమైన దీవాళికి సినిమాను తేలేకపోవడం చూస్తుంటే శంకర్ కన్నా జక్కనే బెటర్ అనిపించకమానదు.