సినీనటుడు బ్రహ్మజీ టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్న నటుడు.ఆయనకు సినిమా షూటింగ్స్ లో బ్రేక్ దొరికితే తన వైఫ్ ని తీసుకుని టూర్స్ కి చెక్కేస్తుంటాడు బ్రహ్మజీ. అయితే బ్రహ్మజీ తన కొడుకు సంజయ్ కి 2013 అతిధుల సమక్షంలో అంగరంగ వైభవంగా ఇంద్రాక్షితో పెళ్లి చేశాడు. ఈ పెళ్ళికి టాలీవుడ్ ప్రముఖులు చాలామంది హాజరయ్యారు. అయితే ఇప్పుడు బ్రహ్మజీ కొడుకు సంజయ్, కోడలు ఇంద్రాక్షి లు త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నట్టు ట్విట్టర్ వేదికగా స్పష్టత ఇచ్చాడు బ్రహ్మజీ.
గత ఐదారు నెలలుగా తన కొడుకు, కోడలు వేర్వేరుగా ఉంటున్నట్లు... త్వరలోనే వీరిరువు కోర్టు ద్వారా విడిపోనున్నట్లు... విడిపోయాక వారు మరో కొత్త జీవితం మొదలు పెట్టడానికి ఆశీర్వచనాలు అందించాలని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. అయితే బ్రహ్మజీ కొడుకు సంజయ్ పశ్చిమ బెంగాల్ కి చెందిన ఫ్యాషన్ డిజైనర్ ఇంద్రాక్షిని ప్రేమించి పెద్దలను ఒప్పించి వివాహమాడారు. మరి ఇన్నేళ్ల తర్వాత ఇలా విడిపోవడానికి కారణాలు తెలియరాలేదు.