నాగ చైతన్య , సమంతలు ప్రేమ పక్షుల్లా విహరించి, విహరించి ఎట్టకేలకు ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్ళికి రెడీ అయ్యారు. అయితే ఎంగేజ్మెంట్ అయ్యాక వీరిరువురు తమ కెరీర్ లో భీభత్సమైన బిజీ అయ్యారు. అదిగో అప్పటినుండి పెళ్లి ఊసెత్తితే ఒట్టు. సమంత - నాగ చైతన్య ల పెళ్లి ఈ నెల్లో ఉంటుంది... ఆ నెల్లో ఉంటుందని అనే గాసిప్స్ రావడమే గాని పెళ్లి డేట్ ఇంతవరకు కన్ఫర్మ్ చెయ్యలేదు. కానీ వీరు మాత్రం ఒకే ఇంట్లో కలిసి ఉంటూ బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు చైతూ 'రారండోయ్ వేడుక చూద్దాం' తో బిజీగా ఉండగా... సామ్ మాత్రం సుకుమార్ డైరెక్షన్ లో రామ్ చరణ్ తో ఒక చిత్రంలో... మరో వైపు మామగారు నటిస్తున్న 'రాజుగారి గది 2' లో ఒక కీలక పాత్రలో నటిస్తూ బిజీగా వుంది. ఇక పెళ్లి మాత్రం వచ్చే ఆగష్టు గాని అక్టోబర్ కానీ అంటున్నారు.
అయితే సమంత రాజమండ్రిలో సుకుమార్ షూటింగ్ కి బ్రేక్ రావడంతో హైదరాబాద్ లో వాలిపోయి కాబోయే భర్త తో వంట చేయించుకుంటూ తన ఫ్రెండ్ తో భలే ఎంజాయ్ చేస్తుంది. వారు అలా ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇక షూటింగ్ కి విరామం పూర్తి కాగానే మళ్ళీ రాజమండ్రికి వెళ్ళింది ఈ అమ్మడు. మరి నాగ చైతన్యతో వంట చేయించుకుని తిన్న సమంత సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. ఫొటోస్ తో పాటే 'నాకు ఇది ఉంటే జీవితంలో అంతా ఉన్నట్లే' అని క్యాప్షన్ తగిలించింది.