తాజాగా చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేష్‌లు నియంతృత్వపాలన వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ప్రకటనల పేరుతో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలను కట్టడి చేస్తున్నారు. తనను విమర్శిస్తున్న సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావును అణగదొక్కి , ఎన్టీవీ నరేంంద్రచౌదరిని భయపెట్టి, బామాలి ఆయన్ను తరిమేశారు. చివరకు ఆయనకి సాక్షినే దిక్కయింది. ఇక సోషల్ మీడియాపై కన్నెర్ర చేస్తున్నారు.
పార్టీకి, తమకు నష్టం కలిగించే విధంగా కథనాలు, సెటైర్లు, పంచ్‌లు విసురుతున్న వారిని, సైబర్ చట్టాలను మరింత కఠినతరం చేసి నానా ఇబ్బందులు గురిచేయడానికి పథకాలు రచిస్తున్నారు. సైకిల్‌కు ఓటేస్తే మీకు మీరు ఉరి వేసుకున్నట్లే.. అని ప్రసంగించి, తాజాగా ఎమ్మెల్సీగా, మంత్రిగా పదవీ స్వీకారమహోత్సంలో నానా తిప్పలు పడి తప్పులు చదవి, నిన్న అనంతపురంలో వచ్చే ఎన్నికలో ఏపీలోని 200 అసెంబ్లీ స్థానాలకు పైగా టిడిపిని గెలిపించాలని కోరిన లోకేష్ తెలివిని చూసి ఏపీ ప్రజలు చప్పట్లు కొట్టి, గంతులేయాలా?
ఎలాగూ టిడిపి పార్టీ వారు ఆపని చేస్తారు. మరి అదే పనిని మీడియా కూడా చేయాలంటే ఎలా? ఇంకా రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన జరగలేదని, ఏపీలోని అసెంబ్లీ స్థానాల సంఖ్య 175 అని తెలియని మంత్రి ఉత్తరకుమారుడిని ఏమనాలి? పండిత పుత్రహ: పరమశుంఠహ.. అన్నదానిని నిరూపిస్తున్న నారా లోకేష్ బాబు వాక్చాతుర్యం చూసి స్వీట్లు పంచాలా? వర్థంతికి, జయంతికి తేడా తెలియని వారిని, వర్ధంతికి శుభాకాంక్షలు తెలపకూడదని తెలియని వారిని ముఖ్యమంత్రిని చేయాలా? తన మంత్రిత్వ శాఖ విధులేంటో కూడా తెలియక తాగునీటి సమస్యను లేకుండా చేయడమే తన మంత్రిత్వ శాఖ ఉద్దేశ్యమని తెలిపిన ఈయనను, బీకాంలో ఫిజిక్స్‌లో ఉంటాయని తెలిపిన వారిని చూసి నవ్వాలా? ఏడవాలా?
కానీ ఈ సెటైర్లను తట్టుకోలేని బాబు ప్రభుత్వం తాజాగా తన పొలిటికల్ పంచ్‌లతో ఇరగదీస్తున్న ఓ విలేకరిని అరెస్ట్ చేసి, కనీసం ఎక్కడ ఉన్నాడో కూడా చెప్పని నియంతృత్వపోకడలను మనం ఏమని అర్ధం చేసుకోవాలి. ఇందిరాగాంధీ వంటి నియంతలే అప్పట్లో నశించిపోయారు. అన్ని అర నిమిషం లో తెలిసిపోయే ఈ రోజుల్లో నియంతృత్వపోకడ చెల్లుబాటు అవుతుందా..?