టాలీవుడ్‌లో క్రియేటివ్ జీనియస్‌లుగా, క్రియేటివ్ డైర్టెర్లుగా పేరున్నవారిలో పెద్ద వంశీ ఒకరైతే.. చిన్నవంశీగా అందరూ ముద్దుగా పిలుచుకునే కృష్ణవంశీ మరోకరు. వీరి చిత్రాలు హిట్టయినా ఫ్లాపయినా వీటి రేంజ్ వేరుగా ఉంటుంది. తమదైన విజన్‌తో చిత్రాలు తీస్తారు. పాపం.. కొన్నిసార్లు ఈ క్రియేటివిటీ ఎక్కువ కావడం వల్ల పరాజయాలు, ప్రేక్షకులకు సినిమాలు అర్థంకావు. ఇక ఎందరో హీరోలు వీరు ఫామ్‌లో ఉన్నప్పుడు వీరితో నటించారు. పెద్ద వంశీ దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్, చిరంజీవి, మోహన్‌బాబు, సుమన్, రవితేజ.. ఇలా ఎందరో నటించారు. ఇక చిన్న వంశీ దర్శకత్వంలో జెడి.చక్రవర్తి, నాగార్జున, మహేష్, రవితేజ, ఎన్టీఆర్ వంటి చాలా మంది నటించారు.
కానీ విజయాలలో నిలకడ లోపించడం, ఒక సినిమా హిట్టయితే పక్క సినిమా ఫట్ అనే పేరు రావడం, సినిమా సెట్‌లోకి వచ్చిన తర్వాత తమకు నచ్చిన సీన్‌ను, తమకు తోచిన విధంగా తీసి, రెండున్నర గంటల చిత్రాన్ని నాలుగైదు గంటల నిడివితో తీస్తారనే చెడ్డ పేరుంది. ఇక వీరి చిత్రాలు ఎప్పుడు మొదలవుతాయో.. ఎప్పుడు విడుదలవుతాయో ఎవ్వరూచెప్పలేరు. ఇక పెద్ద వంశీ తన కెరీర్‌లోనే అతి పెద్ద హిట్టయిన 'లేడీస్‌టైలర్'కు సీక్వెల్‌గా 'ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్'ని కుర్రహీరో సుమంత్ అశ్విన్‌తో తీస్తున్నాడు.
ఇక చిన్న వంశీ అయితే అనుకోకుండా వచ్చిన 'గోవిందుడు అందరివాడేలే'ను సరిగా వాడుకోలేదు. తర్వాత అనూహ్యంగా బాలయ్య నుంచి వచ్చిన 'రైతు'ని పట్టాలెక్కించలేక మరో ఫ్లాప్ యంగ్‌హీరో సందీప్‌కిషన్‌తో 'నక్షత్రం' చేస్తున్నాడు. రెజీనా, ప్రగ్యాజైస్వాల్‌లతో పాటు సాయిధరమ్‌తేజ్‌ను కూడా ఓ కీలకపాత్రకు ఒప్పించి చిత్రం చేస్తున్నాడు. ఇక ఈ చిత్రం ఏమైందో.. ఈ చిత్రానికి వచ్చిన పాట్లే ఏంటో గానీ థియేటర్లలోకి రావడానికి మాత్రం వీలయ్యే పరిస్థితి ప్రస్తుతానికి లేవంటున్నారు. మరి ఈ ఇద్దరు 'వంశీ' ల కథలు ఏ కంచెకి చేరుతాయో వేచిచూడాల్సివుంది...!