Advertisementt

త్రిష మాంచి ఊపుమీదుందబ్బా..!

Thu 20th Apr 2017 08:51 PM
trisha,trisha krishnan,mohini,sathuranga vettai 2,garjanai,1818,96,hye jude  త్రిష మాంచి ఊపుమీదుందబ్బా..!
Trisha Completes 3 Movies at Once త్రిష మాంచి ఊపుమీదుందబ్బా..!
Advertisement
Ads by CJ

ఒకప్పుడు త్రిష టాలీవుడ్, కోలీవుడ్ లలో టాప్ స్టార్స్ అందరితో నటించేసింది. గ్లామర్ పరంగా దూసుకుపోతున్న త్రిషకి గత కొంతకాలంగా హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోయాయి. అయినా త్రిష ఏమాత్రం నిరాశపడకుండా లేడి ఓరియెంటెడ్ పాత్రలవైపు మొగ్గు చూపింది. ఇక అక్కడ నుండి వెనుదిరిగి చూసుకోకుండా త్రిష తన కెరీర్ ని జాగ్రత్తగా మలుచుకుంటూ దూసుకుపోతుంది. తన అందాల ఆరబోతకు ఛాన్స్ లేని చిత్రాల్లో కూడా త్రిష నటనతో ఆకట్టుకుంటుంది. 'నాయకి' వంటి చిత్రాలతో తెలుగు, తమిళ ప్రేక్షకులని పలకరించిన త్రిష ఇప్పుడు ఏకంగా మూడు చిత్రాలని ఒకేసారి పూర్తి చేసి వావ్  అనిపించింది. 

తాజాగా ‘మోహిని, శతురంగ వెట్టై, గర్జానై’ వంటి మూడు చిత్రాలను ఒకేసారి పూర్తి చేసేసింది త్రిష. సుందర్ బాలు డైరెక్షన్ లో బాలీవుడ్ చిత్రం ‘ఎన్హెచ్ 10’ కు రీమేక్ గా ‘గర్జానై’ చిత్రాన్ని చేసిన త్రిష.... నిర్మల్ కుమార్ డైరెక్ట్ చేసిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘శతురంగ వెట్టై’ లో అరవింద స్వామితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. అలాగే మరో హర్రర్ చిత్రం 'మోహిని’ కూడా పూర్తి చేసింది. ఇలా మూడు విభిన్నమైన చిత్రాలను ఒకేసారి పూర్తి చేసి ఔరా అనిపించిన త్రిష ఇప్పుడు తమిళంలో ‘1818, 96' మలయాళంలో ‘హే జూడ్’ వంటి  సినిమాల్లో నటిస్తోంది. గ్లామర్ కి దూరంగా ఉంటేనేమి చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది త్రిష.

Trisha Completes 3 Movies at Once:

>Trisha Completes Mohini, Sathuranga Vettai 2, Garjanai Shootings. 96, 1818, Hey Jude are the Trisha's Future Projects.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ