ఓంకార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రాజుగారి గది 2 లో నాగార్జున, సమంతలు ముఖ్యమైన పాత్రలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రాజుగారి గది మొదటి పార్ట్ లో ఓంకార్ తమ్ముడు హీరోగా చేశాడు. ఆ చిత్రం చిన్న చిత్రంగా విడుదలై ప్రభంజనం సృష్టించింది. ఇక ఇప్పుడు రాజుగారి గది 2 లో టాప్ స్టార్స్ నాగార్జున, సమంత లు నటిస్తుండడంతో ఈ చిత్రానికి భారీ క్రేజ్ ఏర్పడింది. రాజుగారి గది 2 లో నాగార్జున మానసిక వైద్యుని పాత్రలో కనిపిస్తుండగా సమంత ఎలాంటి పాత్ర చేస్తుందో అని అందరూ తెగ క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు.
ఇక సమంత ఈ చిత్రంలో ఒక ఆత్మగా కనిపిస్తుందనే ప్రచారం మొదలైంది. ఈ ఆత్మ పాత్ర రాజుగారిగదికి చాలా ముఖ్యమైన పాత్ర అని అంటున్నారు. ఈ చిత్ర కథ మొత్తం సమంత ఆత్మ చుట్టూతానే తిరుగుతుందని.... అలాగే నాగార్జున, సమంతకి మధ్య నడిచే సన్నివేశాలు ఈ చిత్రానికే హైలెట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న రాజుగారి గది 2 లో సీరత్ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.