ఏ ఇండస్ట్రీలోనైనా ఆ.. నలుగురు లేదా ఆ.. పది మంది.. ఇలా సంఖ్య మారుతుందేమో గానీ బడా నిర్మాతలు మాత్రం ఖచ్చితంగా ఉంటారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్.. ఇలా ఏ వుడ్ అయినా పరిశ్రమను వారే శాసిస్తారు. దీనిపై ఎవరైనా కఠిన నిర్ణయాలు తీసుకుంటే అతనికి వ్యతిరేకంగా తమ వర్గం వారిని కూడా బెట్టి ఆయా నిర్ణయాలు అమలుకు ఆటంకాలు ఏర్పరుస్తారు.
ఇక విషయానికి వస్తే నడిఘర్ సంఘంకే కాకుండా, నిర్మాతల మండలికి కూడా ఎన్నికైన తెలుగబ్బాయి.. తమిళహీరో విశాల్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఎప్పటి నుండో పెండిండ్‌లో ఉన్న నడిగర్ సంఘం తరపున బిల్డింగ్‌ని నిర్మిస్తున్నాడు. ఇక నిర్మాతల మండలికి ఎన్నికైన వెంటనే ఆయన ప్రతి సినిమా టిక్కెట్టులో ఒక రూపాయిని సంక్షోభంలో ఉండి, ఆత్మహత్యలకు పాల్పడుతున్న తమిళనాడు రైతుల నిధిగా ఇవ్వాలని చెప్పాడు. కానీ ఈ విషయంలో మిగతా నిర్మాతలందరూ సిండికేట్ అయి, తామే నష్టాలలో ఉన్నామని, కాబట్టి రైతుకు రూపాయి ఇవ్వమని విశాల్‌పై ఒత్తిడి తెచ్చారు. తమిళనాడులో కూడా సినిమా థియేటర్ల రేట్లను ఇష్టం వచ్చినట్లు పెంచే సౌకర్యం ఉంది. మరి పెద్ద హీరోలు, స్టార్స్ చిత్రాలకు వేలకు వేలు టిక్కెట్స్‌ను నిర్ణయించే నిర్మాతలు ఈ విషయంలో ఎందుకు ముందుకు రాలేకపోయారు? అనేది ఆశ్చర్యం.
కేవలం విశాల్‌కి ఎక్కడ క్రెడిట్ దక్కుతుందోనని వారు పన్నిన కుట్ర ఇది. మరి ఇష్టం వచ్చినట్లు రేట్లు నిర్ణయించుకునే సౌకర్యం ఉన్నప్పుడు తాము అమ్ముతున్న రేటుకు మరో రూపాయిని పెంచి, రైతునిధికి ఇవ్వడంలో ఇబ్బంది ఏంటి? ప్రేక్షకులు రూపాయి కోసం బేరాలాడే పరిస్థితిలో లేరు కదా..! ఇక తాజాగా విశాల్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
శాటిలెట్ చానెల్స్ చిన్న సినిమాలకు, పెద్ద చిత్రాలకు శాటిలైట్‌రైట్స్‌లో చూపిస్తున్న తీవ్ర తేడాలను ఆయన ఖండించాడు. అందుకే చిన్న చిత్రాలను నిర్మించే నిర్మాతలెవ్వరు చానెల్స్‌కి ట్రైలర్స్, టీజర్స్, క్లిప్పింగ్స్, పాటలు ఇవ్వవద్దని కోరాడు. వీటి ద్వారా టీవీ చానెల్స్‌కి అదనపు ఆదాయం వస్తున్నప్పుడు అందులో కొంతవాటాను నిర్మాతలకు ఎందుకు ఇవ్వరో చూద్దామని నిర్ణయించాడు. ఇక తమ పైరసీ వెబ్‌సైట్స్‌తో తమిళ సినిమాలను ముంచుతున్న తమిళ రాకర్స్ వంటి వారికి అల్టిమేటం ఇచ్చాడు. మరి ఆయన మాటలను మిగిలిన వారు ఆచరిస్తారా? అడ్డుపడుతారా? అనేది వేచిచూడాల్సివుంది.