తమిళ, తెలుగుప్రేక్షకుల అభిరుచులు ఒకటే... కాబట్టే సాధారణంగా ఈరెండు భాషల్లో బాగా హిట్టయిన చిత్రాలను మరో భాషలోకి అనువాదాలు, రీమేక్‌లు చేస్తుంటారు. ఇక ఈ రెండు భాషల ఆడియన్స్‌లో కొన్ని తేడాలు కూడా ఉన్నాయి. తమిళ ప్రేక్షకులు కాస్త మొరటుగా, ఓవర్‌యాక్షన్‌తో ఉండే చిత్రాలను, రియలిస్టిక్‌గా ఉండే సినిమాలను, విషాదకరమైన ముగింపులను కూడా బాగా ఆదరిస్తారు. కానీ తెలుగు విషయానికి వస్తే ఇక్కడ హీరోయిజంకు పెద్ద పీట వేస్తారు. హీరోలను పీక్‌లో చూపించాలి. చివరకు సినిమా సుఖాంతమై హీరో గెలవాలి.. ఇది టాలీవుడ్ ఫార్ములా...!
ఇప్పుడిప్పుడే తమ అభిరుచుల్లో అటు తమిళ ప్రజల్లో, ఇటు తెలుగు ప్రేక్షకుల్లో కూడా మార్పు మొదలైంది. కాగా గతంలో ద్విభాషా చిత్రాలుగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన పలు చిత్రాలలో ఎన్నో సపరేట్‌సీన్స్, క్లైమాక్స్‌ల మార్పు వంటివి ఉండేవి. ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో మహేష్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న'స్పైడర్'లోనూ అదే జరుగుతోందిట. ఇప్పటికే ఇక్కడ అక్కడ కమెడియన్లతో పాటు పలు పాత్రలను వేర్వేరు నటీనటులతో సపరేట్‌గా చిత్రీకరిస్తున్నారు.
ఇక తెలుగులో మహేష్‌కు ఉన్న క్రేజ్, ఇమేజ్, పాపులారిటీ అందరికీ తెలిసిందే. దాంతో తెలుగులో ఓ క్లైమాక్స్‌ను తీస్తున్నారట. మహేష్ హీరోయిజంను పీక్స్‌లో చూపించేలా ఇది ఉంటుందని సమాచారం. ఇక తమిళంలో మహేష్ పెద్ద స్టార్ కాదు... దాంతో తమిళంలో ఓ మోస్తరు సింపుల్ క్లైమాక్స్‌ని, అందునా కాస్త నెగటివ్ టచ్ ఉండే విధంగా క్లైమాక్స్‌ని తీస్తున్నారని సమాచారం. దీంతో పాటు పలు సన్నివేశాలు కూడా తెలుగు, తమిళంలో వేర్వేరుగా ఉంటాయట. ఏ విషయం జూన్23న కానీ తెలియదు.