Advertisementt

ఆంటీ అనే పదానికి ఈమె యాంటీ..!

Thu 20th Apr 2017 11:27 AM
aishwarya rai bachchan,filmfare may issue,big b family,aishwarya rai aunty  ఆంటీ అనే పదానికి ఈమె యాంటీ..!
Aishwarya Rai Bachchan is Anti to Aunty Word ఆంటీ అనే పదానికి ఈమె యాంటీ..!
Advertisement
Ads by CJ

వయసు 43.. ఒక బిడ్డకు తల్లి.. అందునా ఓ విశేషమైన సినీ ఫ్యామిలీకి కోడలు.. మామ, అత్త, భర్త అందరూ నటులే. ఆమె ఐశ్వర్యారాయ్‌.. ఈ మాజీ ప్రపంచ సుందరి అభిషేక్‌బచ్చన్‌కి భార్యగా, అమితాబ్‌ ప్యామిలీకి కోడలుగా మారింది. దాంతో ఆమె సోయగాలను చూసి మత్తులో మునిగిపోయిన పలువురు అభిమానులు చాలా ఆవేదన చెందారు. తమ అందాల సుందరిని ఇక వెండితెరపై చూడలేమా...! అని ఆవేదన చెందారు. కానీ ఆమె ఎనిమిదేళ్లకిందట రీఎంట్రీ ఇచ్చింది. 

దీంతో కొందరు ఆనందపడినా.. బచ్చన్‌ ఫ్యామిలీ వీరాభిమానులు మాత్రం మండిపడ్డారు. తమ అభిమాన హీరోల ఫ్యామిలీ పరువు తీయవద్దని ఆందోళనలు సైతం చేశారు. కానీ ఆ కుటుంబం ఇచ్చిన ప్రోత్సాహంతోనే మరలా నటించడం మొదలుపెట్టిన ఐశ్వర్యారాయ్‌ మాత్రం రీఎంట్రీలో కాస్త నటనకు స్కోప్‌ఉన్న పాత్రలోనే నటించింది. దీంతో బాధపడ్డవారు. అనందపడ్డవారు కూడా ఉన్నారు. ఇక ఇటీవల వచ్చిన 'యే దిల్‌ హై ముష్కిల్‌' చిత్రంలో తన కంటే దాదాపు దశాబ్దం చిన్నవాడైన రణవీర్‌తో హాట్‌ హాట్‌ షో చేసి కుర్రహీరోయిన్లను కూడా భయపెట్టింది. 

ఈ చిత్రం చూసిన తర్వాత చాలా మంది వయసు పెరిగినా కూడా మనసులో పాటు శరీరానికి కూడా ముసలితనం రానివ్వని ఏదైనా యంత్రం, మంత్రం ఆమె వద్ద ఉందా? అని అనుమానపడ్డారు. ఇక ఇటీవల ఓ మేగజైన్‌కు హాట్‌ఫొటో షూట్‌ చేసింది. తాజాగా విడుదలైన ఫిల్మ్‌ఫేర్‌ మ్యాగజైన్‌ కోసం ఆమె చేసిన హాట్‌షో చూస్తే మతిపోతుంది. దీంతో ఆంటీ వయసులో ఉన్నప్పటికీ ఈమె ఆ పదానికి యాంటీగా ఉందే అనే అనుమానం కలుగుతోంది. శృంగార ప్రియులు మాత్రం ఆమె ఆరాధనలో తరిస్తున్నారు.  

Aishwarya Rai Bachchan is Anti to Aunty Word:

Aishwarya Rai Bachchan is on a mission -- to prove that age is just a number or that ageing simply doesn't apply to her. Aishwarya Rai shoot for Filmfare May issue and she is looking scorching.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ