మహాభారతం... ఇది సినిమా పేరు. ఇప్పుడు ఈ పేరు గురించే అన్ని భాషల సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా చర్చ నడుస్తుంది. పాపం రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం. కానీ రాజమౌళికి ఈ సినిమా ఎప్పుడు తీద్దామని దానిమీద ఒక క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు రాజమౌళి లేని మహాభారతం తెరకెక్కుతుంది. అదికూడా 1000 కోట్ల భారీ బడ్జెట్ లో అతి పెద్ద ప్రాజెక్ట్ గా మహాభారతం తెరకెక్కుతుంది. ప్రముఖ వ్యాపారవేత్త ఫిలాంత్రఫిస్ట్ డా. బి. ఆర్.శెట్టి నిర్మించనున్న ఈ సినిమాని దర్శకుడు శ్రీకుమార్ మీనన్ డైరెక్ట్ చేయనున్నాడు. అయితే ఈ చిత్రం ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఎం .టీ. వాసుదేవన్ నాయర్ రచించిన 'రాందముళం' అనే నవల ఆధారంగా రూపొందించనున్నారట.
ఇక ఇప్పుడు ఈ సినిమాలో నటించే నటీనటుల గురించి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఏ పాత్రకి ఎవరు బాగుంటారో అనే దాని మీద ఆయా హీరోల ఫ్యాన్స్ క్లారిటీ ఇచ్చేస్తున్నారు. మరి తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, ఇంగ్లీష్, బాలీవుడ్ భాషల్లో తెరకెక్కనున్న ఈ భారీ ప్రాజెక్టులో అమితాబ్ బచ్చన్ భీష్ముడి పాత్రకి, షారుఖ్ ఖాన్ దుర్యోధనుడి పాత్రకి, అమీర్ ఖాన్ కృష్ణుడి పాత్రకి, మోహన్ లాల్ భీముడి పాత్రకి, అజయ్ దేవగణ్ కర్ణుడి పాత్రకి, అర్జునుడిగా హృతిక్ రోషన్ అంటూ అభిమానులతోపాటు నెటిజన్లు కూడా ఆయా హీరోలను ఆయా పాత్రలకి సెలెక్ట్ చేసేస్తున్నారు.
అయితే అసలు మహాభారతం తియ్యాలనుకున్న డైరెక్టర్ గారు ఏ హీరో ఏ పాత్రకి బాగుంటుంది అని అనుకుంటున్నారో గాని ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం పై విధంగా ప్రచారం జరుగుతుంది. అయితే అన్ని భాషలు టాప్ హీరోలను ఈ మహాభారతంలో నటించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని.... ఆ బాధ్యతను ఒక హాలీవుడ్ డైరెక్టర్ తన భుజాల మీద వేసుకున్నాడని సమాచారం.