Advertisementt

మరో విలన్‌ రెడీ...!

Wed 19th Apr 2017 09:47 PM
hero srikanth,naga chaitanya,lavanya tripathi,mohanlal  మరో విలన్‌ రెడీ...!
Ready To Another Villain...! మరో విలన్‌ రెడీ...!
Advertisement
Ads by CJ

తన కెరీర్‌ను విలన్‌ క్యారెక్టర్లతో మొదలుపెట్టి ఆ తర్వాత హీరోగా టర్న్‌ తీసుకున్నాడు సీనియర్‌ హీరో శ్రీకాంత్‌. కాగా హీరోగా ఓ వెలుగు వెలిగిన తర్వాత ఆయన కెరీర్‌ మరలా కాస్త జోరు తగ్గింది. దాంతో కాలానుగుణంగా 'సరైనోడు, గోవిందుడు అందరివాడేలే' వంటి చిత్రాలలో సపోర్టింగ్‌ క్యారెక్టర్స్‌ చేస్తున్నాడు. పనిలో పనిగా తన సీనియర్లయిన జగపతిబాబు, సుమన్‌, భానుచందర్‌, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌, అరవింద్‌స్వామి వంటి వారి తరహాలో విలన్‌ పాత్రలను ఓకే చేస్తున్నాడు. 

కాగా ఆయన ఇప్పటికే మోహన్‌లాల్‌ ప్రదానపాత్రలో నటిస్తున్న మలయాళ 'విలన్‌' చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర చేస్తూ మలయాళంలోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇదే చిత్రంలో విశాల్‌, రాశిఖాన్నాలు కూడా నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలు చేస్తుండటం విశేషం. కాగా ప్రస్తుతం శ్రీకాంత్‌ మరో చిత్రంలో కూడా విలన్‌గా ఓకే చేశాడు. కృష్ణవైరిముత్తు అనే నూతన దర్శకుని డైరెక్షన్‌లో నాగచైతన్య, లావణ్యత్రిపాఠిల కాంబోలో తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ వేగంగా జరుగుతోంది. ఇందులో శ్రీకాంత్‌ ప్రతినాయకుడి పాత్రను చేస్తున్నాడు. మొత్తానికి ఈ కొత్త విలన్‌ను తెలుగు ప్రేక్షకులు తమ మూడో ఇన్నింగ్స్‌లో ఎలా ఆదరిస్తారో వేచిచూడాల్సివుంది...! 

Ready To Another Villain...!:

srikanth is acting start villain character in tollywood films then next turn to hero character. present srikanth acted movie in malayalam film villain movie in this movie mohanlal main character and srikanth is villain character

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ