ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యమేలుతున్న చంద్రబాబు ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ 2019లో జరగబోయే ఎన్నికల కోసం స్కెచ్‌ల మీద స్కెచ్‌లు రచిస్తుంది. ముఖ్యంగా 2019లో ఏపీలో పోటీచేసే వైఎస్‌ఆర్‌సీపీ, జనసేనలను ఏవిధంగా దెబ్బకొట్టాలనే వ్యూహరచనలు అప్పుడే అమలులో కూడా పెట్టేసింది టీడీపీ.
నియోజక వర్గాల వారిగా ఎవరి బలం ఎంత అనే దానిపై దృష్టిపెట్టిన టిడిపి, ఆ బలం ఉన్న వారికి పదవులు కట్టబెట్టి.. క్యాస్ట్ పాలిటిక్స్‌కి నాంది పలికింది. దీని ద్వారా వైఎస్‌ఆర్‌సీపీకి స్ట్రయిట్ దెబ్బపడేలా ప్లాన్ చేసింది. ఇక గత ఎన్నికల్లో ఎంతో సహాయం చేసిన జనసేన పార్టీని కూడా ఈసారి పైకి రానివ్వకుండా చూడాలని టిడిపి పథక రచనలు చేస్తుంది.
తాజాగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ..రాబోయే ఎలక్షన్స్‌లో కూడా టిడిపి, బిజెపి, జనసేనలు కలిసి పనిచేస్తాయని, ఇది సత్యమని చెప్పుకొచ్చాడు. ఈ టిడిపి నేత ఇది ఖచ్చితంగా జరుగుతుందని సవాల్ కూడా విసిరాడు. సో..అతని మాటల వెనుక మర్మం ఏమిటో రాజకీయాలు తెలియని వారికేమో..గానీ, తెలిసిన వారికి మాత్రం చక్కగా అర్ధమవుతోంది. అలాగే రెండు రోజుల క్రితం యంగ్‌టైగర్ యన్టీఆర్ కొత్త పార్టీ అంటూ, జరిగిన ప్రచారం కూడా టిడిపి వ్యూహమేనని తెలుస్తుంది.