కోన వెంకట్, శ్రీనువైట్ల, గోపీమోహన్ త్రయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు వీళ్లు మంచి మంచి హిట్స్ ఇండస్ట్రీకి ఇచ్చారు. గుర్తింపు ఇవ్వడం లేదు అనే కారణంగా కోన వెంకట్ వేరే కుంపటి పెట్టేశాడు. ఇది అందరికీ తెలిసిన విషయయే. అయితే 'బ్రూస్‌లీ' కోసం మళ్లీ వీరిని ఏకం చేసిన ఘనత మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్‌లకు దక్కుతుంది. ఆ సినిమా కూడా హిట్ కాకపోవడంతో వీరు మళ్ళీ ఎవరి పనిలో వారు బిజీ అయ్యారు.
స్క్రిఫ్ట్స్ రాసుకుంటూ కోన బిజీగా ఉంటే..తాజాగా వచ్చిన 'మిస్టర్' చిత్రమే తన సర్వస్వం అన్నట్లుగా శ్రీనువైట్ల తీరు నడిచింది. తీరా ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఇప్పుడు శ్రీను వైట్ల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. మరి ఇలాంటి సందర్భంలో శ్రీను వైట్ల 'మిస్టర్' ని చూశారా..! అని కోన వెంకట్‌ని అడిగితే ఎలా ఉంటుంది?
నాకు అంత టైమ్ లేదు. ఇంకా ఆ సినిమా చూడలేదు. చూసిన తర్వాత మాత్రమే ఏదైనా మాట్లాడగలను అంటూ కోన వెంకట్ 'మిస్టర్' పై తనకు ఎదురైన ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. సో..అందువల్లే కోన నుండి ఇంత వరకు 'మిస్టర్' స్పందించలేదన్నమాట.