ఇటీవల రజినీకాంత్ సినిమా రివ్యూల గురించి మాట్లాడుతూ..సినిమా రిలీజ్ అయిన మూడు రోజుల తర్వాత రివ్యూలు ఇస్తే బావుంటుంది. తద్వారా నిర్మాతలకు మేలు జరుగుతుంది అని వివరించారు. కానీ దీనిని టాలీవుడ్ టాప్ నిర్మాత అయిన డి. సురేష్‌బాబు ఖండిస్తున్నారు.
ఒక బాగున్న సినిమాకి నెగిటివ్ రివ్యూ ఇచ్చినా కూడా కలెక్షన్స్ పరంగా, మౌత్ టాక్ పరంగా..ఆ మూవీ చేరుకోవాల్సిన విజయాన్ని అందుకుంటుంది. అలాగే ప్లాప్ సినిమాకి పాజిటివ్‌గా రివ్యూ ఇచ్చినా..ఆ సినిమా ఆడేది అంతంత మాత్రమే. కానీ రివ్యూల వల్ల చిన్న సినిమాలకు చాలా లాభం ఉంటుంది. ఉదాహరణకి 'పెళ్లిచూపులు, ఘాజీ' వంటి చిత్రాలు రివ్యూల వల్లే ప్రేక్షకాదరణ పొందాయి. ఆ చిత్రాలకి వచ్చిన రివ్యూలు చూసే ప్రేక్షకులు ఈ చిత్రాలని ఆదరించారు. ఇలాంటి చిత్రాలని థియేటర్స్‌కి వచ్చి చూసేలా చేయగలిగిన సత్తా రివ్యూలకి మాత్రమే ఉంది.
అలాంటి రివ్యూలని బ్యాన్ చేయాలని చెప్పడం కరెక్ట్ కాదు. ఈ డెసిషన్ పై ఒక్కసారి ఆలోచిస్తే మంచిది. ఇంకా చెప్పాలంటే..రివ్యూలని బ్యాన్ చేసినా..సోషల్ మీడియాలో నెటిజన్స్ సినిమా రిజల్ట్‌లపై చెప్పే అభిప్రాయాలని ఆపగలరా..! అంటూ సురేష్‌బాబు రివ్యూల బ్యాన్‌పై తన అభిప్రాయాన్ని వివరించారు.