వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్ జంటగా నటించిన 'మిస్టర్ ' చిత్రం గత శుక్రవారం విడుదలై మిశ్రమ టాక్ తో థియేటర్స్ లో రన్ అవుతుంది. బాక్స్ ఆఫీస్ వద్ద మిశ్రమ స్పందనతో మిస్టర్ చిత్రానికి కలక్షన్స్ కూడా డ్రాప్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. అయితే మిస్టర్ ని తెరకెక్కించిన శ్రీను వైట్ల కథని సరిగా నేరేట్ చెయ్యలేకపోయాడని... అసలు కథే లేకుండా సినిమాని తెరకెక్కించాడని క్రిటిక్స్ నుండి కామెంట్స్ పడ్డాయి. ఇక ఈ నెగెటివ్ కామెంట్స్ లో మిస్టర్ రన్ టైమ్ కూడా ఎక్కువనే కామెంట్స్ కూడా ఉన్నాయి.
ఫస్ట్ ఆఫ్ లెంత్ సెకండ్ ఆఫ్ లెంత్ బాగా ఎక్కువగా ఉండడంతో ఆడియన్స్ బాగా ఇబ్బందిపడ్డారని గ్రహించిన చిత్ర యూనిట్ మిస్టర్ రన్ టైమ్ కాస్త తగ్గిస్తే బావుంటుందని భావించి అక్కడక్కడా కొన్ని సీన్స్ కి కత్తెర వేసిందట. దాదాపు 17 నిమిషాల నిడివి వరకు కట్ చేసిందని సమాచారం. ఇక ఇలా కొంత రన్ టైమ్ ని కట్ చెయ్యడం వలన ఆడియన్స్ కూడా కాస్త రిలీఫ్ కి ఫీల్ అయ్యే అవకాశం ఉండడంతో సినిమాపై పాజిటివ్ టాక్ ఏర్పడే అవకాశం ఉన్నందున ఇలా అనవసరమైన సీన్స్ ని కట్ చేసిపడేసినట్లు చిత్ర యూనిట్ చెబుతుంది. ఇక ఇలా పాజిటివ్ టాక్ గనక స్ప్రెడ్ అయితే కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.