కేంద్రమంత్రి, టిడిపి సీఈవో సుజనాచౌదరి. రాజకీయాలలోకి ఎలా వచ్చాడో? ఈ స్థాయికి ఎలా ఎదిగాడో అందరికీ తెలుసు. ఆయనకు ఆయనగా టిడిపిలో తాను నెంబర్2ని అని ఊహించుకుంటున్నాడు. కానీ లోకేష్ తెరపైకి రావడంతో ఈయనకు ఏమి తోచడం లేదు. ఎందుకైనా మంచిదని భావించి తనకు లోకేష్‌కు ఎలాంటి విభేదాలు లేవని, తాను నెంబర్2ని కానని వివరణ ఇచ్చుకున్నాడు.
ఇక ప్రత్యేకహోదా ఉద్యమాన్ని పందుల పోటీతో పోల్చిన ఆయన ప్రత్యేకహోదా కంటే ప్రత్యేక ప్యాకేజీతో మేలని తమకు అర్ధమైందన్నాడు. ఆయన మేధావి కాబట్టి అర్దమైంది.. కానీ సామాన్యులకు, ఎంతో మంది మేధావులకు మాత్రం ప్రత్యేకహోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ మేలని ఇంకా అర్ధం కావడం లేదు. సో.. ఆయన దృష్టిలో ప్రత్యేకహోదా కావాలని డిమాండ్ చేస్తున్న ఆంధ్రులందరూ తెలివితక్కువ వారు.
ఇక పవన్‌కు కూడా తాను వివరించి చెబుతానని, తన అపాయింట్‌మెంట్ తీసుకొని వస్తే తాను వివరిస్తానని అన్నాడు. అయినా ఇక్కడ కేవలం ఎవరినో నీ ఆఫీస్ గదికి తీసుకొని, నీ అపాయింట్‌మెంట్ తీసుకుని వస్తే వివరించాల్సిన అవసరం లేదు. టిడిపి చేతిలో పలు చానెల్స్ ఉన్నాయి. ఒక లైవ్ డిబేట్ కార్యక్రమం ఏర్పాటు చేసి, ప్రజలకు కూడా నేరుగా ప్రశ్నలు సంధించే అవకాశం ఇస్తే అది చాలు.. పాపం..
ఆయన కేంద్రమంత్రి వర్యులు కాబట్టి ఆయనకు అందరికీ విడివిడిగా వివరించాలంటే సమయం సరిపోదు. కాబట్టి దీనికి మీ మీడియాను వాడుకోండి అని సలహా ఇవ్వాలి.. ఇక తాము గత ఎన్నికల్లో పవన్‌ను వాడుకొని వదిలేయలేదని, తమది సిద్దాంతాలు కలిగిన పార్టీ అని చెప్పాడు. అయ్యో.. సుజనా.. నీ చరిత్ర ఏంటో ఏపీలోని అందరికీ తెలుసు కదా. ఎందుకు మళ్లీ ఈ మాటలు.