బాహుబలి తర్వాత ప్రభాస్, రానాలు పెళ్లి చేసుకుంటారంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. తాజాగా ఓ చానెల్ ఇంటర్వ్యూలో ప్రభాస్, రానా, అనుష్కలు ఓ ఆసక్తికర ప్రసంగం చేశారు. ప్రభాస్ మాట్లాడుతూ, నా పెళ్లి ఎప్పుడో నాకే తెలియదు. ఈ ప్రశ్నకు సమాధానం ఎవరికీ తెలియదని వ్యాఖ్యానించాడు. ఇక ఆయన మాట్లాడుతూ, తమన్నాతో పనిచేసిన హీరోలకు వెంటనే పెళ్లిళ్లు అయిపోయాయి. రామ్‌చరణ్ నుంచి పలువురు తమిళ హీరోల వరకు అదే జరిగింది. కానీ నాకు మాత్రం తమన్నా పవర్ పనిచేయలేదు. ఆమెతో రెండు సినిమాలు చేసినా నాకు పెళ్లి ముహూర్తం రాలేదు... బహుశా ఈ సెంటిమెంట్ రివర్స్ అయి తమన్నాకు పెళ్లైపోతుందేమో చూడాలి అని వ్యాఖ్యానించాడు. కాగా ప్రభాస్‌కి ఇప్పుడు 38ఏళ్లు, 40వ పడిలో పడటానికి ఆయనకు ఇంక రెండు అడుగులు మాత్రమే దూరముంది. మరి ప్రభాస్ తన అభిమానుల కోరిక ఎప్పుడు తీరుస్తాడో చూడాలి.
ఇక పెళ్లి విషయమై రానా మాట్లాడుతూ, నాకు చాలా పనులున్నాయి.. బిజీగా ఉన్నాను. మరో రెండేళ్ల వరకు పెళ్లి మాటే వద్దు అన్నాడు.. అవునులే.. పలువురు హీరోయిన్లతో ఎఫైర్ లు వున్నాయంటూ వస్తున్నా వార్తల్ని ఎంజాయ్ చేస్తూ బిజీ బిజీగా ఉన్న రానాకు పెళ్లి కాకపోయినా, ఇబ్బంది ఏం ఉండదు కదా..! అనే సెటైర్లు వినిపిస్తున్నాయి.
ఇక అనుష్క మాట్లాడుతూ, ప్రభాస్, రానాలలాగానే నా వివాహానికి కూడా సమయం ఉందని చెప్పింది. సరే హీరోలు కాబట్టి, మగాళ్లు కాబట్టి వారికి కాస్త ఆలస్యంగా పెళ్లైనా ఫర్వాలేదు. కానీ అనుష్కకి పెద్దగా ఛాన్స్ లు రావడం లేదు కాబట్టి అనుష్క పెళ్ళికి తొందరపడితేనే బెటర్ అంటున్నారు.