Advertisementt

అరవింద్ గారూ.. పెళ్లి చూపుల్ని వదిలేశారే?

Mon 17th Apr 2017 08:51 PM
allu aravind,allu academy of arts,shatamanam bhavati,pellichoopulu,chiranjeevi,allu arjun  అరవింద్ గారూ.. పెళ్లి చూపుల్ని వదిలేశారే?
Allu Academy Of Arts Neglected Pellichoopulu for National Awards Appreciation అరవింద్ గారూ.. పెళ్లి చూపుల్ని వదిలేశారే?
Advertisement

తాజాగా చిరంజీవి, అల్లుఅరవింద్‌.. అల్లుఅర్జున్‌లు ఓ మంచి పని చేశారు. వాళ్ళే హీరోలు, నిర్మాతలమై ఉండి.. 'శతమానం భవతి' నిర్మించిన దిల్‌రాజుకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఇక తాను నటించిన 'ఖైదీ..' చిత్రానికి పోటీగా విడుదలై ఘనవిజయం సాధించి, తమకు రాని నేషనల్‌ అవార్డును సాధించుకున్న దిల్‌రాజు-సతీష్‌ వేగేశ్న-శర్వానంద్‌ల 'శతమానం భవతి' చిత్ర యూనిట్‌కు వారు అభినందన సభ ఏర్పాటు చేయడం అభినందనీయం. 

ఇక బన్నీ మాట్లాడుతూ, దిల్‌రాజు, తన కెరీర్‌లు ఒకేసారి ప్రారంభమయ్యాయని, 'దిల్‌' , 'గంగోత్రి'లు కూడా ఒకే సమయంలో విడుదలయ్యాయని, ఇక దిల్‌రాజు రెండో చిత్రంలో 'ఆర్య'లో తానే  హీరోగా నటించిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం దిల్‌రాజు నిర్మిస్తున్న 25వ చిత్రం 'డిజె'లో కూడా తానే హీరోననే విషయాన్ని చెప్పుకున్నాడు. ఇక 'శంకరాభరణం, గీతాంజలి' తర్వాత నేషనల్‌ అవార్డు పొందిన చిత్రంగా తెలుగు కీర్తిని చాటి చెప్పిందని, 'బాహుబలి'లాగే 'శతమానం భవతి' కూడా ఆస్థాయిలో తెలుగు పరిశ్రమకు గర్వంగా నిలబడిందని చెప్పాడు. ఇది అక్షరసత్యం. 

కానీ ఇక్కడ ఓ విమర్శ వస్తోంది. దిల్‌రాజుకు మెగాహీరోలకు, అల్లుఅరవింద్‌కు ఉన్న బంధం, అనుబంధం అందరికీ తెలిసిందే. ఆ నలుగురిలో ఇద్దరు 'అల్లు-రాజు'లే. ఆ అనుబంధంతో ఏర్పాటు చేసినా, మరెందుకు ఏర్పాటు చేసినా కూడా ఈ స్ఫూర్తిని మెగాఫ్యామిలీ నిలబెట్టింది. కానీ ఇదే సభలో 'పెళ్లిచూపులు'తో తొలిచిత్రంతోనే అవార్డులు, రివార్డులు గెలుచుకున్న దర్శకుడిని కూడా పిలిచి సన్మానించి ఉంటే కొత్తవారికి ప్రోత్సాహం అందేది. 

Allu Academy Of Arts Neglected Pellichoopulu for National Awards Appreciation :

Shatamanam Bhavati Appreciation Meet By Allu Academy Of Arts.  Chiranjeevi and Allu Academy Of Arts Appreciated Shatamanam Bhavati Team for National Awards, Neglected Pellichoopulu.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement