త్రివిక్రమ్ - పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయిపోయి సెట్స్ మీదకెళ్ళిపోయింది. అపుడే హైదరాబాద్ లో ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేసేసుకుంది. ఈ చిత్రంలో పవన్ కి జోడిగా మొదటిసారి కీర్తి సురేష్, అను ఇమ్మాన్యువల్ లు నటిస్తుండగా మరో పవర్ ఫుల్ కేరెక్టర్ లో సీనియర్ నటి ఖుష్బూ నటిస్తుంది. ఇక ఈ చిత్రానికి 'ఇంజనీర్ బాబు' అనే టైటిల్ బాగా ప్రచారంలో ఉంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా నటిస్తున్నాడని ప్రచారం జరుగుతుండగా ఇప్పుడు ఈ చిత్రానికి టైటిల్ 'ఇంజనీర్ బాబు' అని అంటున్నారు.
అయితే ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పేరు 'బాబు' అని కూడా ప్రచారం మొదలైంది. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం పవన్ బాబు ఇంజనీరు బాబే అని సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు. ఈ టైటిల్ పవన్ కి సరిగ్గా సూట్ అవుతుందని పవన్ గత చిత్రాల్లోని ఫొటోస్ తీసుకుని 'ఇంజనీర్ బాబు' టైటిల్ పెట్టేసి పోస్టర్స్ కూడా తయారు చేసేస్తున్నారు. మరి ఇంత జరుగుతున్న త్రివిక్రమ్ సైడ్ నుండి గాని పవన్ సైడ్ నుండిగాని ఈ చిత్రానికి టైటిల్ 'ఇంజనీరు బాబు' అని మాత్రం క్లారిటీ రావడం లేదు.