Advertisementt

కీర్తి దూకుడు మాములుగా లేదుగా..!

Sun 16th Apr 2017 01:12 PM
tamil heroine,keerthy suresh,nayantara,keerthy remuneration,telugu industry  కీర్తి దూకుడు మాములుగా లేదుగా..!
కీర్తి దూకుడు మాములుగా లేదుగా..!
Advertisement
Ads by CJ

కీర్తి సురేష్ తమిళంలో, తెలుగులో అవకాశాలు అందిపుచ్చుకుంటూ టాప్ హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇస్తుంది. ఎటువంటి ఎక్సోపోజింగ్ కి తావివ్వకుండా కీర్తి సురేష్ బికినీ వేసిన భామలకు కూడా ఒణుకు పుట్టించే రేంజ్ కి వెళ్ళిపోయింది. అసలు ఆమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనతికాలంలోనే ఇలాంటి రేంజ్ కి వెళ్లడం అనేది సామాన్య విషయం కాదు. రోజురోజుకి కీర్తి పాపులారిటీ అమాంతంగా పెరిగిపోతుంది. అయితే ఇప్పుడు కీర్తి సురేష్ రెమ్యునరేషన్ విషయంలో కూడా టాప్ హీరోయిన్స్ కి పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగింది. 

ఇక తమిళంలో ఇప్పటివరకు మూడు కోట్ల రెమ్యునరేషన్ తో నయనతార  టాప్ ప్లేస్ లో కొనసాగుతుంది. అసలు నయన్ కి ఆ రేంజ్ రెమ్యునరేషన్ అందుకోవడానికి చాలా ఎక్కువ సమయం పట్టింది. అంతేకాకుండా నయనతార అవకాశం వచ్చినప్పుడు బికినీ షో తో మత్తెక్కించింది కూడా. అలాగే అందాలా ఆరబోతకు అడ్డు చెప్పకుండా నయన్ ఈ ప్లేస్ కి రాగలిగింది. కానీ కీర్తి సురేష్ కి మాత్రం చాలా తక్కువ టైం లోనే  తన రెమ్యునరేషన్ రేంజ్ పెంచేసుకుంది. ఇక అందాల ఆరబోత అనేది కీర్తి ప్రస్తుతం ఇప్పటివరకు నటించిన సినిమాల్లో ఎక్కడా కనబడదు. అయినా నిర్మాతలు ఆమెకు ఎంతటి రెమ్యునరేషన్ ఇవ్వడానికైనా వెనుకాడడం లేదు.

ఇప్పుడు తెలుగులో కూడా కీర్తి దూకుడు మాములుగా లేదు. ఎందుకంటే ఆమె నటించిన 'నేను శైలజ, నేను లోకల్' రెండూ తెలుగులో ఆమెకు మంచి ఫలితాన్నిచ్చాయి.అంతేకాకుండా పవర్ స్టార్ పవన్ పక్కన ఛాన్స్, మహానటి సావిత్రి బయో పిక్ లో సావిత్రి రోల్ మరివి మామూలు విషయాలు కాదు. అందుకే మహానటి లో టైటిల్ రోల్ కి గాను కీర్తి అక్షరాలా మూడు కోట్లు అందుకుని సంచలం సృష్టించింది. తెలుగులో రకుల్ ప్రీత్ సింగ్, సమంత, కాజల్ , తమన్నా లు టాప్ ప్లేస్ కు చేరుకోవటానికి పట్టిన సమయంలో కేవలం పావు వంతులో కీర్తి టాప్ ప్లేస్ ని ఆక్రమించి ఔరా అనిపించింది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ