Advertisementt

రజనీ.. ఈ క్లారిటీ కూడా ఇచ్చేయ్..!

Sun 16th Apr 2017 12:12 PM
super star rajinikanth,robo 2.0 movie,dhanush,ranjith paa director,producer dhanush  రజనీ.. ఈ క్లారిటీ కూడా ఇచ్చేయ్..!
రజనీ.. ఈ క్లారిటీ కూడా ఇచ్చేయ్..!
Advertisement
Ads by CJ

ఒకప్పుడు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ చిత్రమంటే మూడేళ్లకు ఒకటి వచ్చేది. అభిమానుల మైండ్‌ కూడా అలానే ఉండేది. కానీ రజనీ 70ఏళ్లకు వేగం పెంచాడు. 'కబాలి' చిత్రం షూటింగ్‌లో ఉండగానే శంకర్‌ '2.0'ని పట్టాలెక్కించాడు. ఇక 'కబాలి' సమయంలో అనారోగ్యం వల్ల అమెరికా వెళ్లి రెండు నెలలు రెస్ట్‌ తీసుకున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన '2.0' చిత్రం షూటింగ్‌ను కూడా పూర్తి చేసేశాడు. కాగా '2.0' చిత్రం దీపావళికి విడుదల కానుంది. 

కానీ రజనీ మాత్రం అప్పటివరకు ఆగడం లేదు. మే నెలలోనే ఆయన తాజా చిత్రం పట్టాలెక్కనుంది. ఈ విషయాన్ని ఆయన అల్లుడు ధనుష్‌ వెల్లడించాడు. 'కబాలి' దర్శకుడు రంజిత్‌పా దర్శకత్వంలో ధనుష్‌ నిర్మాతగా ఈ చిత్రం రూపొందనుంది. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో నడిచే మాఫియా లీడర్‌ పాత్ర ఇది. కాగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్‌కు విడుదల ప్లాన్‌ చేస్తున్నట్లు ధనుష్‌ క్లారిటీ ఇచ్చాడు. ఈ చిత్రం కూడా 'బాషా' తరహాలోనే ఉంటుందట. 

కాగా ఆల్‌రెడీ రంజిత్‌పా దర్శకత్వంలోనే 'కబాలి' నిర్మాత కళైపులి థాను కూడా తాను అదే దర్శకునితో రజనీ హీరోగా 'కబాలి2' ప్లాన్‌ చేస్తున్నానని తెలిపాడు. కానీ ఈ రెండింటికీ రంజిత్‌ దర్శకత్వం వహిస్తే వీటిలో 'కబాలి2' ఎవరి చిత్రం? ధనుష్‌దా? లేక కళైపులిథానుదా? అనేది తేలాల్సివుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ