Advertisementt

చైతూ కోరికను తీరుస్తాడో..? లేదో..?

Sun 16th Apr 2017 11:25 AM
akkineni heroes,naga chaitanya,akhil,chandu mondeti director,rarandoy veduka chudam movie  చైతూ కోరికను తీరుస్తాడో..? లేదో..?
చైతూ కోరికను తీరుస్తాడో..? లేదో..?
Advertisement
Ads by CJ

అక్కినేని నాగేశ్వరరావుకి క్లాస్‌ హీరోగా పేరుంది. ఇక నాగార్జునకు క్లాస్‌తో పాటు మాస్‌ ప్రేక్షకుల్లో కూడా మంచి గుర్తింపు ఉంది. ఇక అక్కినేని అఖిల్‌ విషయానికి వస్తే తన మొదటి చిత్రం 'అఖిల్‌' డిజాస్టర్‌ అయినప్పటికీ ఆయనకు మొదట్లోనే మాస్‌ ఆడియన్స్‌ ఫ్యాన్స్‌ కూడా ఏర్పడింది. ఇక తన తొలి చిత్రం 'జోష్‌' నుంచి దడలంటూ, బెజవాడపై దాడి చేసినా, ఆటోనగర్‌ సూర్యగా దోచేయ్‌ అన్నా కూడా నాగచైతన్యకు మాత్రం ఇప్పటివరకు మాస్‌ ఇమేజ్‌ రాలేదు. 

ఇక 'తడాఖా' హిట్టయినా కూడా అది రీమేక్‌ కావడం, సునీల్‌ కూడా ప్రధాన పాత్ర పోషించడం వల్ల ఆ క్రెడిట్‌ మొత్తం చైతూకి దక్కలేదు. అయినా కూడా కేవలం క్లాస్‌ హీరోగా మిగిలిపోవడం చైతూకి ఇష్టం లేదు. త్వరలో విడుదల కానున్న కళ్యాణ్‌కృష్ణ 'రారండోయ్‌ వేడుక చూద్దాం' చిత్రంలో క్లాస్‌తో పాటు మాస్‌ టచ్‌ని కూడా చైతూ ఇవ్వబోతున్నాడట. ఆ తర్వాత ఆయన కృష్ణ వైరిముత్తు అనే కొత్త దర్శకునితో చేస్తున్నది ఓ థ్రిల్లర్‌ సబ్జెక్ట్‌. 

ఇక తాజాగా చైతూ... చందు మొండేటి దర్శకత్వంలో మరో చిత్రం చేయనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఒక రీమేక్‌ బ్లాక్‌బస్టర్‌ని 'ప్రేమమ్‌'గా తీసి క్లాసిక్‌ హిట్‌ ఇచ్చిన చందు ఈ కొత్త చిత్రంలో నాగచైతన్యను పక్కా యాక్షన్‌ అండ్‌ మాస్‌ హీరోగా చూపించనున్నాడని సమాచారం. మరి ఈ చందు అయినా చైతూ కోరికను తీరుస్తాడో? లేదో? వేచిచూడాల్సివుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ