దేశం గర్వించదగ్గ క్రియేటివ్ జీనియస్ డైరెక్టర్ మణిరత్నం ఆమధ్య వరకు వరుస ఫ్లాప్‌లతో డీలాపడిపోయాడు. ఇక ఆయన క్రియేటివిటీ ఆవిరైందని, ఆయన పనైపోయిందని అందరూ భావించారు. కానీ 'ఓకే బంగారం' చిత్రాన్ని ఆయన తెరకెక్కించిన తీరు, దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్‌ల క్యారెక్టరైజేషన్స్ నుంచి సహజీవనం నేపథ్యంలో ఆయన ఎంచుకున్న కథ కూడా బాగా ఉంది. దాంతో మణి మరలా ట్రాక్‌లోకి వచ్చాడని, నేటి జనరేషన్ పల్స్‌ని పట్టుకున్నాడని అందరూ భావించారు.
కానీ తాజాగా కార్తి, ఆదితిరావు హైదరిల కాంబినేషన్‌లో ఏఆర్‌రెహ్మాన్‌తో చేసిన 'చెలియా' చిత్రం దారుణమైన ఫ్లాప్‌గా నిలిచింది. ఈ చిత్రం తమిళ వెర్షన్ 'కాట్రువెలియాదై'ది కూడా అదే పరిస్థితి. దీంతో వాట్ నెక్స్ట్ అని మణి ఆలోచనలో పడ్డాడట. కోలీవుడ్ మీడియా వార్తల ప్రకారం ఆయన ప్రస్తుతం ఓ బాలీవుడ్ చిత్రానికి స్టోరిని సిద్దం చేస్తున్నాడని సమాచారం.
ఆయన ఆస్థాన నటులైన అభిషేక్‌బచ్చన్, ఐశ్వర్యారాయ్‌ల కాంబినేషన్‌లో తన సొంతంగానే నిర్మాతగా, దర్శకునిగా ఓ చిత్రం చేయాలని భావిస్తున్నాడు. అభిషేక్, ఐశ్వర్యాలు కూడా దీనికి సుముఖంగానే ఉన్నారట. గతంలో 'గురు, రావణ్'లతో పెద్దగా ఆలరించలేకపోయిన మణి ఈసారైనా బ్లాక్‌బస్టర్ కొడతాడేమో చూడాలి....!