తాజాగా అంబేడ్కర్ జయంతి వేడుకల సందర్భంగా యూపీ సంచలన సీఎం యోగి ఆదిత్యనాధ్ సంచలన ప్రకటన చేశారు. మహనీయులు పుట్టిన రోజులలో సెలవలు ఇవ్వడాన్ని ఆయన వ్యతిరేకించారు. ఆరోజున అందరూ పనిచేయాలని, మరీ ముఖ్యంగా పాఠశాలల్లో విద్యార్థిని విద్యార్ధులకు ఆయా రోజుల్లో వారి గొప్పతనాన్ని గురించి రెండు గంటలు బోధించాలని సూచించారు. ఇది అద్భుత నిర్ణయం.
ఇక పవన్‌కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించే సమయంలో ఓ విషయాన్ని ప్రస్థావించారు. దేశంలో కేవలం స్వాతంత్య్ర దినోత్సమైన ఆగష్టు15, రిపబ్లిక్ డే అయిన జనవరి 26న తప్ప ఏ మహనీయులకు, ఏ మత పండగలకు కూడా సెలవులు ఇవ్వకూడదని వ్యాఖ్యానించాడు. ఈ విషయంలో పవన్ ఆనాడు చేసిన వ్యాఖ్యలను పలు మతాల వారు, పలు కులాలకు చెందిన నాయకులు మండిపడ్డారు. కానీ ఇదే సరైన నిర్ణయం.
గాంధీ నుంచి అంబేడ్కర్ వరకు, శ్రీరామనవమి నుంచి క్రిస్మన్, రంజాన్‌లకు కూడా ప్రభుత్వాలు సెలవులు ఇవ్వడాన్ని నిలిపివేయడం సర్వదా ఆచరణీయం. మరి యోగి కూడా మహనీయుల జయంతులనే కాదు.. పలు మతాల పండుగల సెలవులను కూడా రద్దు చేయాలి. మిగిలిన ప్రభుత్వాలు అదే పంథాలో పయనించాలి.