అల్లు అర్జున్ 'డీజే... దువ్వాడ జగన్నాథం' చిత్రం జులై మొదటి వారంలో విడుదలవుతుందని... కన్ఫర్మ్ అయింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ పవర్ ఫుల్ బ్రాహ్మణ గెటప్ లో కనిపిస్తాడని ఫస్ట్ లుక్ ని పోస్టర్స్ ని చూస్తుంటే అర్ధమవుతుంది. ఈ సినిమాని మే లో రిలీజ్ చెయ్యాలని దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాత దిల్ రాజు అనుకున్నారు. కానీ కొన్ని కారణాలవల్ల అది కాస్తా జులై కి వెళ్ళిపోయింది. ఇక 'డీజే' చిత్రం తర్వాత అల్లు అర్జున్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని రైటర్ వక్కంతం వంశీ డైరెక్షన్ లో 'నా పేరు సూర్యా... నా ఇల్లు ఇండియా' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మధుర శ్రీధర్ నిర్మిస్తుండగా చిరు పెద్ద తమ్ముడు నాగబాబు సమర్పణలో తెరకెక్కుతుంది.
అయితే వక్కంతం డైరెక్షన్ లో అల్లు అర్జున్ నటించే 'నా పేరు సూర్య..' చిత్రంలో అల్లు అర్జున్ ఒక పవర్ ఫుల్ సైనికుడిగా కనిపిస్తాడని ప్రచారం జరుగుతుంది. ఈ చిత్ర కథలో భాగంగా కొన్ని యుద్ధసన్నివేశాలు ఉంటాయని... వాటిని అత్యంత అద్భుతంగా తెరకెక్కించడానికి మొదటిసారిగా డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతున్న వక్కంతం భారీగా ప్లాన్ చేస్తున్నాడట. ఇక జవాను పాత్రలో బన్నీ రోల్ చాలా పవర్ ఫుల్ గా వుంటుందట. ఇక ఈ చిత్రాన్ని జూన్ లో సెట్స్ మీదకి తీసుకెళ్లి వచ్చే సంక్రాతి బరిలో నిలపాలని డైరెక్టర్, నిర్మతలు భావిస్తున్నారట. ఈ చిత్రంలో అల్లు అర్జున్ కి జోడిగా క్యారా అద్వాని, దిశాపటాని లలో ఎవరో ఒకరిని ఎంపికచేస్తారని సమాచారం.