Advertisementt

ఆ బడా నిర్మాత ఆశలన్నీ మహేష్‌పైనే..!

Sat 15th Apr 2017 08:37 PM
tagore madhu,nallamalupu srinivas,spyder,winner,mister  ఆ బడా నిర్మాత ఆశలన్నీ మహేష్‌పైనే..!
ఆ బడా నిర్మాత ఆశలన్నీ మహేష్‌పైనే..!
Advertisement
Ads by CJ

ఠాగూర్‌ మధు..ఈయన తన పేరును నిరూపించుకుంటూ ఇటీవల నల్లమల్లపు బుజ్జితో కలిసి ఇద్దరు మెగా యంగ్‌ హీరోలతో సినిమాలు నిర్మించాడు. సాయిధరమ్‌తేజ్‌తో భారీ బడ్జెట్‌తో 'విన్నర్‌'ను, తాజాగా వరుణ్‌తేజ్‌ తో శ్రీనువైట్ల దర్శకత్వంలో కూడా భారీ బడ్జెట్‌తో 'మిస్టర్‌' లను నిర్మించాడు. ఈ రెండు చిత్రాలకు మొదటి రోజే పూర్తి నెగటివ్‌ టాక్‌ వచ్చింది. ఆల్‌రెడీ 'విన్నర్‌' ద్వారా బాగా నష్టపోయిన మధు, బుజ్జిలకు 'మిస్టర్‌' ఫలితం కూడా తీవ్ర నిరాశనే మిగులుస్తోంది. ఈ చిత్రం ద్వారా కూడా భారీ నష్టాలు ఖాయమని ఫిల్మ్‌ వర్గాలు, ట్రేడ్‌ పండితులు అంచనా వేస్తున్నారు. 

లారెన్స్‌-పి.వాసుల కాంబినేషన్‌లో వచ్చిన డబ్బింగ్‌ చిత్రమైన 'శివలింగ' నే 'మిస్టర్‌' కంటే ఫర్వాలేదనిపిస్తోంది. ఇక ఠాగూర్‌ మధుకు ఇద్దరు మెగాఫ్యామిలీ హీరోలు షాక్‌ ఇవ్వడంతో ప్రస్తుతం మధు, ఎన్వీ ప్రసాద్‌ కలయిక తో భారీ బడ్జెట్‌తో వస్తున్న మహేష్‌బాబు-మురుగదాస్‌ల 'స్పైడర్‌' మీదనే నమ్మకం పెట్టుకున్నాడు. సరే కనీసం ఠాగూర్‌ మధుకు ఆ ఆశైనా ఉంది... కానీ నల్లమలుపు బుజ్జికి మాత్రం ప్రస్తుతం భవిష్యత్తు గందరగోళంగానే ఉంది. మరి బుజ్జి ఎవరిని పట్టుకుంటాడో వేచిచూడాల్సివుంది..! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ