ఇటీవల చిరు తాను 'భగత్‌సింగ్' జీవిత చరిత్రలో నటించలేకపోయానని, కానీ అలాంటి తరహా కథే అయిన 'ఉయ్యాలవాడ'లో నటిస్తున్నందుకు ఆనందంగా ఉందని చెప్పాడు. ఇక తెలుగులో తెలిసిన బయోపిక్‌లు తీయాలంటే ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఎవ్వరికీ పెద్దగా తెలియని 'గౌతమీపుత్ర శాతకర్ణి', 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి'లైతే ఫర్వాలేదు. కానీ కొన్ని బయోపిక్స్‌ని బాలీవుడ్, హాలీవుడ్ వారు తీసినట్లుగా, వాటిని చూసినట్లుగా మనవారు తీయలేరు.. ప్రేక్షకులు చూడలేరు. అందుకే సావిత్రి బయోపిక్ 'మహానటి', ఎన్టీఆర్ బయోపిక్‌లను కూడా బాలకృష్ణ ఎలాంటి వివాదాల జోలికి పోకుండా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక 'అల్లూరి సీతారామరాజు'గా అదరగొట్టిన సూపర్‌స్టార్‌కృష్ణ చిరకాల వాంఛ 'ఛత్రపతి శివాజీ' బయోపిక్. కానీ ఆ చిత్రాన్ని ఉన్నది ఉన్నట్లు తీస్తే ముస్లింల మనోభావాలు దెబ్బతింటాయని కృష్ణ వెనుకడారనేది వాస్తవం. ఇక 'భగత్‌సింగ్' చరిత్రను చిరు చేసినా కూడా అందులో కొందరు మహానాయకుల గురించిన వాస్తవాలను చూపించాల్సివస్తుంది. అందుకే చిరు అంత ఆశపడినా ఆ చిత్రం చేయలేకపోయాడు. ఇది నగ్న సత్యం...!