Advertisementt

పవన్‌ ..బండ్ల తో జర భద్రం...!!

Sat 15th Apr 2017 02:19 PM
pawan kalyan,bandla ganesh,vv vinayak,raj kiran,pawan kalyan movies  పవన్‌ ..బండ్ల తో జర భద్రం...!!
పవన్‌ ..బండ్ల తో జర భద్రం...!!
Advertisement
Ads by CJ

పవన్‌పై గత కొంతకాలంగా శరత్‌మరార్‌, బండ్లగణేష్‌ వంటి వారిని చేరదీస్తున్నాడనే విమర్శలు మొదలయ్యాయి. పవన్‌ భజన చేస్తూ వారు పవన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని అంటున్నారు. ఇక ప్రస్తుతం వినాయక్‌ చిరుతో 'నాన్‌బాహుబలి' రికార్డులను బద్దలు కొట్టిన 'ఖైదీ నెంబర్‌ 150' చేసిన తర్వాత... చిరు, చరణ్‌, కాజల్‌ అందరూ ఊపులో ఉన్నప్పటికీ తర్వాతి చిత్రం విషయంలో వినాయక్‌కి మాత్రం మరో పెద్ద ఆఫర్‌ రాలేదు. స్టార్స్‌ అందరూ బిజీగా ఉన్నారు. ఇక వినాయక్‌ ప్రస్తుతం పవన్‌ కోసం ఓ మంచి స్టోరీ విషయంలో పనిచేస్తున్నాడని వినిపిస్తోంది. సో.. త్రివిక్రమ్‌ సినిమా తర్వాత పవన్‌.. ఏయంరత్నంకి కూడా గ్యాప్‌ ఇచ్చి వినాయక్‌తో చిత్రం చేయనున్నాడని అంటున్నారు. దానికి నిర్మాతగా బండ్లగణేష్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అదే నిజమైతే మాత్రం తప్పంతా పవన్‌దేనని చెప్పాలి. 

ఆల్‌రెడీ కృష్ణవంశీ దర్శకత్వంలో బండ్లగణేష్‌.. రామ్‌చరణ్‌తో చేసిన 'గోవిందుడు అందరివాడేలే' చిత్రం ఆడకపోగా, చిరుకు తలనొప్పిగా మారింది. ఈ చిత్రం నుంచి తనను అకారణంగా తొలగించారని, తన యాక్టింగ్‌ ముందు చరణ్‌ నిలబడలేకపోవడం వల్లనే తనను ఆచిత్రం నుంచి తొలగించారని పవర్‌పాండి రాజ్‌కిరణ్‌ ఆరోపిస్తున్నాడు. ఇక రాజ్‌కిరణ్‌కి ఇవ్వాల్సిన 10లక్షలు కూడా బండ్ల గణేష్‌ సెటిల్‌చేయలేదని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మెగాక్యాంపు మాత్రం మౌనంగానే ఉంది. 

ఇక రాజ్‌కిరణ్‌ పాత్రను ప్రకాష్‌రాజుకి ఇచ్చి, ఆ రీషూట్‌తో పాటు మిగిలిన సహాయాన్ని కూడా చిరు, చరణ్‌లు బండ్లకు చేశారు. కానీ బండ్ల మాత్రం రాజ్‌కిరణ్‌కి 10లక్షలు ఎగ్గొట్టాడు. దర్శకనిర్మాతలను కాకపట్టడానికి, హీరోల డేట్స్‌ సంపాదించేందుకు లక్షల రూపాయలను గిఫ్ట్‌లుగా వెదజల్లే గణేష్‌ వంటి వారు రాజ్‌కిరణ్‌ విషయంలో ఇలా ప్రవర్తించి చెడ్డపేరు తెస్తున్నారు. కాబట్టి పవన్‌.. బండ్లగణేష్‌ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటాడో వేచిచూడాల్సివుంది.... 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ