Advertisementt

అల్లు వారి చిన్నబ్బాయ్ పరిస్థితి ఇది..!

Sat 15th Apr 2017 02:06 PM
allu sirish,mallidi venu,vi anand,geetha arts,allu aravind  అల్లు వారి చిన్నబ్బాయ్ పరిస్థితి ఇది..!
అల్లు వారి చిన్నబ్బాయ్ పరిస్థితి ఇది..!
Advertisement
Ads by CJ

మాస్టర్‌ బ్రెయిన్‌ అల్లుఅరవింద్‌ తన మరో తనయుడు అల్లుశిరీష్‌ని హీరోగా నిలబెట్టేందుకు నానాతిప్పలు పడుతున్నాడు. ప్రకాష్‌రాజ్‌ చేత 'గౌరవం'తో లాంచ్‌ చేశాడు. ఫలితం అందరికీ తెలిసిందే. ఇక 'కొత్తజంట'తో మారుతిని నమ్ముకున్నాడు. అదీ బాగానే దెబ్బేసింది. ఇటీవల పరుశురామ్‌ని నమ్మి 'శ్రీరస్తు..శుభమస్తు' చేశాడు. ఇది రొటీన్‌ కథే అయినా డైరెక్టర్‌ టాలెంట్‌ పుణ్యమా అని ఓకే అనిపించుకుంది. ఇంకేముంది.. బన్నీకి మలయాళంలో ఉన్న కొద్దొ గొప్పొ పేరును చూసి శిరీష్‌ని కూడా మాలీవుడ్‌ పంపాలని డిసైడ్‌ అయ్యాడు. మోహన్‌లాల్‌హీరోగా నటించిన '1971 బియాండ్‌ ది బోర్డర్స్‌' చిత్రంలో సపోర్టింగ్‌ రోల్‌ ఇప్పించాడు. 

మేజర్‌ రవి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అల్లుశిరీష్‌కి కనీస గుర్తింపు కూడా లభించలేదు. ఇందులో మోహన్‌లాల్‌ పక్కన అల్లువారబ్బాయి తేలిపోయాడట. దీంతో ఒకేసారి ఈ చిత్రాన్ని తెలుగులో కూడా డబ్‌ చేయాలని భావించినప్పటికీ ప్రస్తుతం ఆ సినిమా విడుదలయ్యే అవకాశమే లేదంటున్నారు. సో.. ఈ చిత్రం బారిన పడకుండా అల్లుఅరవింద్‌ మంచి పనే చేశాడు. తెలుగు ప్రేక్షకులను రక్షించాడు. ఇక శిరీష్‌ ప్రస్తుతం 'ఎక్కడికి పోతావు చిన్నవాడా'తో కేకపెట్టించిన దర్శకుడు వి.ఐ.ఆనంద్‌తో సైన్స్‌ఫిక్షన్‌ చేస్తున్నాడు. 800ఏళ్లనాటి కథతో మల్లిడివేణు పక్కకు తప్పుకున్నాడు. మరి ఆనంద్‌ అరవింద్‌గారి కోరిక తీరుస్తాడో? లేదో? వేచిచూడాల్సివుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ