Advertisementt

మరోసారి కలెక్షన్‌కింగ్‌కి.. సూపర్‌స్టార్‌ సలహా..!

Sat 15th Apr 2017 12:09 PM
mohan babu,rajinikanth,dhanush,tamil movie,powerpandey movie  మరోసారి కలెక్షన్‌కింగ్‌కి.. సూపర్‌స్టార్‌ సలహా..!
మరోసారి కలెక్షన్‌కింగ్‌కి.. సూపర్‌స్టార్‌ సలహా..!
Advertisement
Ads by CJ

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కి కలెక్షన్‌కింగ్‌ మోహన్‌బాబు ఎంత సన్నిహితుడో చెప్పనక్కరలేదు. కాగా మోహన్‌బాబు కెరీర్‌లో పెద్ద హిట్‌గా నిలిచిన 'పెదరాయుడు' చిత్రంలో రజనీని లేకుండా మనం ఆ సినిమానే ఊహించలేం. ఆయన క్యారెక్టర్‌కు ఆ చిత్రం అంతగా పేరుతెచ్చి... సినిమాకు బ్యాక్‌బోన్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేయడానికి, అందులోనూ తాను ఓ పవర్‌ఫుల్‌ పాత్రను చేయడానికి రజనీనే కారణం. కాగా ఈరోజు తమిళ ఉగాది సందర్భంగా తమిళనాడులో 'పవర్‌పాండీ' విడుదలైంది. ఈ చిత్రానికి తమిళనాడులో ముందుగానే ప్రీమియర్‌షోలు వేశారు.

అందరు ఆ చిత్రం సూపర్‌ అంటున్నారు. కాగా ఈ చిత్రాన్ని తన మామ రజనీ కోసం ధనుష్‌ స్పెషల్‌షో వేశాడు. దీనికి రజనీ మోహన్‌బాబును కూడా ఆహ్వానించాడని సమాచారం. ఈ చిత్రం చూసిన తర్వాత రజనీతో పాటు మోహన్‌బాబు కూడా ధనుష్‌ను పొగడ్తలతో ముంచెత్తారట. మరో 10ఏళ్లు ఈ చిత్రం ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతుందని, ఆ చిత్రం ద్వారా వచ్చే పేరును చెడగొట్టుకోవద్దని ధనుష్‌ కు సలహా ఇచ్చినట్లు సమాచారం. కాగా ఈ చిత్రాన్ని తెలుగులో మోహన్‌బాబును రీమేక్‌ చేయమని రజనీ సలహా ఇచ్చాడంటున్నారు. అందుకే ఈ చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్‌ చేయలేదని చెబుతున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ