Advertisementt

ముద్దుగుమ్మల సైడ్‌ బిజినెస్‌ బాగుంది..!

Fri 14th Apr 2017 07:33 PM
raashi khanna,mamatha mohandas,shruti haasan,nithya menone,kajal aggarwal  ముద్దుగుమ్మల సైడ్‌ బిజినెస్‌ బాగుంది..!
ముద్దుగుమ్మల సైడ్‌ బిజినెస్‌ బాగుంది..!
Advertisement
Ads by CJ

ఇప్పుడు ముద్దుగుమ్మలు కూడా ముదిరిపోతున్నారు. తెలుగువారైన మన హీరోలు స్వంతంగా పాటలు పాడుతూ, సింగర్స్‌గా మారిపోతుంటే.. ఇక పరభాషా వారు అయినప్పటికీ ముద్దుగుమ్మలు కూడా ప్రొఫెషనల్‌ సింగర్స్‌ అయిపోతున్నారు. ఇప్పటికే మమతామోహన్‌దాస్‌ తర్వాత శృతిహాసన్‌, నిత్యామీనన్‌లు పాటలను స్వయంగా పాడేస్తున్నారు. ఇక కాజల్‌ అయితే పునీత్‌రాజ్‌కుమార్‌ హీరోగా నటించిన 'చక్రవ్యూహ' చిత్రంలో పాటలు పాడింది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ కూడా ఓ పాటను పాడిన సంగతి తెలిసిందే. తాజాగా మరోహీరోయిన్‌ రాశిఖాన్నా ఇప్పటికే 'జోరు' చిత్రంలో టైటిల్‌ సాంగ్‌ పాడి బాగా టాలెంట్‌ చూపించింది. ఇప్పుడు మలయాళంలో పాట పాడింది. మొత్తానికి ఉత్తరాదికి చెందిన ఈ భామ తెలుగు, మలయాళం వంటి భాషల్లో ఎలాంటి తడబాటు లేకుండా పాడటం చూస్తే వావ్‌..అనిపించకమానదు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ