లావణ్య త్రిపాఠి 'అందాల రాక్షసి' చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే అందరిని ఆకట్టుకున్న ఈ భామ ఇప్పటివరకు నటించిన సినిమాల్లో గ్లామర్ పరంగా చాలా డిస్టెన్స్ మెయింటింగ్ చేస్తూ వచ్చింది. అయితే లావణ్య అందాల ఆరబోతకు ఒప్పుకోకపోవడం వల్లే ఆమె నటించే సినిమాల్లో గ్లామర్ లావణ్యని చూడలేకపోయామని అనుకుంటున్నారు చాలామంది. కానీ లావణ్యకు అందాలు ఆరబోసే ఛాన్స్ డైరెక్టర్స్ ఇవ్వకపోవడం వలెనే ఇలా ట్రెడిషనల్ గా కనపడ్డానని... లేకుంటే తనకి గ్లామర్ పాత్రలే ఇష్టమనే కోరికను ఈ మధ్యనే బయటపెట్టింది.
తాజాగా లావణ్య నటించిన 'మిష్టర్' చిత్రం రేపు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో కూడా లావణ్య చాలా ట్రెడిషనల్ గా పల్లెటూరి అమ్మాయిగా కనబడనుందని ట్రైలర్స్ చూస్తుంటే తెలుస్తుంది. అయితే సినిమాలో ఎలా ఉన్నప్పటికీ లావణ్య పాటల్లో మాత్రం హాట్ హాట్ గా గ్లామర్ లుక్ లో కనిపిస్తోంది. ఇక అందాల ఆరబోతలో ఒకడుగు ముందుకు వేసిందని అర్ధమవుతుంది. ఇక తర్వాత లావణ్య, నాగ చైతన్యతో ఒక చిత్రంలో చేస్తుండగా... శర్వానంద్ తో 'రాధా' చిత్రంలో నటిస్తుంది. ఇక 'రాధా' చిత్రం కూడా త్వరలోనే రిలీజ్ కి సిద్ధమవుతోంది.
అయితే లావణ్యకి నాగ చైతన్యతో కమిట్ అయిన చిత్రంలో అందాల ఆరబోతకు ఛాన్స్ ఉన్నట్లే కనబడుతుంది. ఎందుకంటే దర్శకుడు కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో నాగచైతన్యతో లావణ్య నటించే చిత్రం లోని కొన్ని పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ స్టిల్స్ లో లావణ్య పొట్టి నిక్కరు, స్లీవ్ లెస్ బనీన్ తో మోడ్రన్ లుక్కులో కనబడుతుంది. అంటే ఈ చిత్రంలో ఖచ్చితంగా లావణ్య త్రిపాఠి అనుకున్నట్లే మోడ్రెన్ లుక్ తో దర్శనమిస్తుందన్నమాట.