Advertisementt

మహేష్... ఇంటర్వ్యూ లో కొన్ని మీ కోసం..!

Fri 14th Apr 2017 04:01 PM
mahesh babu,spyder movie,director a r murugadoss,mahesh babu in tv interview,ram charan,chiranjeevi family  మహేష్... ఇంటర్వ్యూ లో కొన్ని మీ కోసం..!
మహేష్... ఇంటర్వ్యూ లో కొన్ని మీ కోసం..!
Advertisement
Ads by CJ

మహేష్ బాబు, మురుగదాస్ డైరెక్షన్ లో తమిళం, తెలుగులో ఒకేసారి తెరకెక్కే 'స్పైడర్' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ తెలుగులో నిన్న బుధవారం విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇక తమిళంలో కూడా రేపు శుక్రవారం 'స్పైడర్' ఫస్ట్ లుక్ ని విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా మహేష్ బాబు తాజాగా ప్రముఖ తమిళ మ్యాగజైన్ 'ఆనంద విఘటన్' కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో మహేష్ పలు ఆశక్తికర విషయాలను వెల్లడించాడు. 

అదులో కొన్ని మీ కోసం... చిరంజీవి ఫ్యామిలీతో తనకు చాలా సాన్నిహిత్యం ఉందని... చిరు కొడుకు చరణ్ తో మా ఫ్యామిలీ చాలా క్లోజ్ గా ఉంటుందని... తమ మధ్యన ఎలాంటి గొడవలు లేవని క్లారిటీ ఇచ్చాడు. అయితే అభిమానులు మాత్రం పరస్పరం మా ఇద్దరి గురించి గొడవ పడుతుంటారని... ఇటు నా ఫ్యాన్స్ అటు చరణ్ ఫ్యాన్స్ నిత్యం బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ గురించి సోషల్ మీడియా వేదికగా గొడవ పడుతున్నారని.. అవన్నీ చూస్తుంటే మాకు ఇబ్బందిగాను... బాధగాను ఉంటుందని చెప్పాడు. 

అలాగే నాకు తమిళ హీరో విజయ్ తో కూడా మంచి ఫ్రెండ్ షిప్ ఉందని.. నేను విజయ్ కలిసి మణిరత్నం డైరెక్షన్ లో నటించాలనుకున్నామని... కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదని చెప్పాడు. అంత లెజెండరీ డైరెక్షర్ డైరెక్షన్ లో నటించకపోవడం కొంచెం బాధగా ఉందని కూడా చెప్పాడు. మరి అభిమానుల గురించి మహేష్ చెప్పిన మాటలు మెగా అభిమానులే కాకుండా మిగతా హీరోల అభిమానులు కూడా తలకెక్కించుకుంటే ఎక్కడా ఎటువంటి అనర్ధాలు జరగవని కొంతమంది సలహా ఇస్తున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ