ఎట్టకేలకు మహేష్ 'స్పైడర్' లుక్ విడుదల చేశాడు డైరెక్టర్ మురుగదాస్. మహేష్ 'స్పైడర్' లుక్ కి మిక్సడ్ రెస్పాన్స్ వస్తుంది. ఇకపోతే తెలుగు, తమిళం, హిందీ మూడు భాషల్లోనూ ఒకే టైటిల్ కావాలని పట్టుబట్టి మరీ మహేష్ 'స్పైడర్' కి ఓటేసి మరీ మురుగదాస్ ని ఒప్పించాడట. అయితే ఈ టైటిల్ ఇంగ్లీష్ లో ఉండడం కూడా మూడు భాషలకి కలిసొచ్చింది. ఇక ఫస్ట్ లుక్ తోనే సినిమా పై భారీ అంచనాలు పెంచేశాడు మురుగదాస్. అసలు మురుగదాస్ చిత్రమంటే అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. హీరోలను చాలా స్టైలిష్ గా చూపించే మురుగదాస్ ఇప్పుడు స్పైడర్ లో కూడా మహేష్ ని అంతే స్టైల్ గా కాకపోతే కొంచెం రొటీన్ గా చూపించేశాడు.
ఇక ఇలా 'స్పైడర్' ఫస్ట్ లుక్ విడుదల చేశారో లేదో అలా శాటిలైట్ రైట్స్ భారీ లెవల్లో అమ్ముడుపోయాయి. మహేష్ కున్న క్రేజ్ చూసి జీ నెట్వర్క్ తెలుగు.. తమిళ్ తో పాటు హిందీ భాషల శాటిలైట్స్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసింది. 'స్పైడర్' కి మూడు భాషలకు కలిపి దాదాపు 26.5 కోట్ల రూపాయలు కు అమ్ముడు పోయాయి. మరి టాలీవుడ్ లో ఇంత భారీ మొత్తం బాహుబలి తర్వాత ఒక్క 'స్పైడర్' కే దక్కింది. మరి ఫస్ట్ లుక్ టాక్ ఎలా ఉన్నప్పటికీ 'స్పైడర్' సాటిలైట్ హక్కుల ద్వారా భారీ ధరకు అమ్ముడు పోయింది. ఇక ఫస్ట్ లుక్ తోనే మంచి బిజినెస్ చేసిన 'స్పైడర్' థియేట్రికల్ ట్రైలర్ గనక వదిలితే ఇంకెంత క్రేజ్ వస్తుందో అని అభిమానులు ఆశతో ఎదురు చూస్తున్నారు.
100 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న 'స్పైడర్' చిత్రంలో మహేష్ కి జోడిగా రకుల్ ప్రీత్ నటిస్తుండగా... హరీష్ జైరాజ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.