Advertisementt

అలా అని అందరిని ఆశ్చర్య పరిచింది..!

Thu 13th Apr 2017 05:24 PM
pawan kalyan,director trivikram srinivas,keerhti suresh,anu emmanuel,khushboo  అలా అని అందరిని ఆశ్చర్య పరిచింది..!
అలా అని అందరిని ఆశ్చర్య పరిచింది..!
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాబినేషన్ లో ఒక చిత్రం షూటింగ్ స్టార్ట్ చేసుకుని అప్పుడే మొదటి షెడ్యూల్ పూర్తి చేసేసుకుంది. ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మానుయేల్ లు నటిస్తున్నారు. అంతేకాకుండా సీనియర్ నటి ఖుష్బూ కూడా పవన్ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్, అను ఇమ్మానుయేల్ ల మీద కొన్ని సీన్స్ షూట్ చేసిన త్రివిక్రమ్ ఇప్పుడు ఖుష్బూ పై కూడా కొన్ని సీన్స్ షూట్ చేశారట. తెలుగులో లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ నటిస్తున్న ఖుష్బూ, త్రివిక్రమ్ సినిమా షూట్ లో జాయిన్ అవ్వగానే తన తొలిరోజు షూటింగ్ అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా  ఫ్యాన్స్ తో పంచుకుంది.

ఇంతకీ ఖుష్బూ ఏమనిందో తెలుసా.. పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబో షూటింగ్ లో ఈ రోజే పాల్గొన్నానని... ఇలా షూటింగ్ లో పాల్గొన్న నాకు మొదటి రోజు స్కూల్ కి వెళ్లినట్టుంది.. ఇంకా నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని ట్వీట్ చేసి ఆశ్చర్య పరిచింది. ఒకప్పుడు హీరోయిన్ గా వెలుగొందిన ఖుష్బూ ఇప్పటికీ తమిళ స్క్రీన్ పై మెరుస్తూనే వుంది. కొన్నాళ్ళు రాజకీయాలంటూ సినిమాలకు దూరమైనా కూడా మళ్లీ కొన్ని సినిమాల్లో నటించింది కూడా. మరి అంత సీనియర్ నటి అయ్యుండి ఇలా ఇప్పుడు త్రివిక్రమ్ డైరెక్టన్ లో నటించిన మొదటిసారి మళ్లీ స్కూల్ కి వెళ్లినట్టుందని చెప్పి అందరిని ఆశ్చర్య పరిచింది.

ఇకపోతే ఖుష్బూ ఆ మధ్య కాలంలో చిరంజీవికి అక్కగా స్టాలిన్ చిత్రంలో నటించింది. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ చిత్రంలో ఏ పాత్రలో కనిపించనుందో ప్రస్తుతానికి సస్పెన్స్. అయితే త్రివిక్రమ్ దిరెచ్తిఒన్ లో పవన్ నటించబోయే చిత్రం టైటిల్ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఒక టైటిల్ చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో పవన్ సాఫ్ట్ వెర్ ఇంజనీరుగా కనబడతాడని ప్రచారం జరుగుతుండగా... ఇక ఆ ప్రచారానికి ఊతమిస్తూ కళ్యాణ్ బాబు 'ఇంజినీరు బాబు' అంటూ ఒకటే ప్రచారం జరుగుతుంది.    

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ