Advertisementt

సింపుల్ స్పైడర్..!

Thu 13th Apr 2017 04:42 PM
mahesh babu,spyder movie,director a r murugadas  సింపుల్ స్పైడర్..!
సింపుల్ స్పైడర్..!
Advertisement
Ads by CJ

ఏ ఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో మహేష్ చేస్తున్న చిత్రం షూటింగ్ మొదలుపెట్టుకుని దాదాపు 10  నెలలు గడుస్తున్నా... ఈ చిత్రానికి సంబంధించి మహేష్ లుక్ ఇదిగో వస్తుంది అదిగో వస్తుందని ఊరించారే తప్ప దాన్ని బయటికి వదలలేదు. ఇక మహేష్ లుక్ కోసం మహేష్ అభిమానులతోపాటే సాధారణ ప్రేక్షకుడు కూడా తెగ ఎదురు చూసే పరిస్థితికి తీసుకొచ్చాడు మురుగదాస్. ఇక మురుగదాస్ ఎప్పటినుండో ఆన్ ద వే అంటూ ఊరిస్తున్న మహేష్ లుక్ అండ్ టైటిల్ ని ఈ రోజు బుధవారం సాయంత్రం రివీల్ చేసేసాడు.

మహేష్ కొత్త చిత్రం టైటిల్ 'స్పైడర్' అని... మహేష్ లుక్ ఇదిగో అంటూ రెండు ఫొటోస్ ని రెండు పోస్టర్స్ ని ఒక మోషన్ పోస్టర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. అయితే టైటిల్ కి తగ్గట్టు  సినిమాలో ఎమన్నా సాలిగూడులు ఉంటాయా లేకపోతె మురుగదాస్ ఆ టైటిల్ ని ఎందుకని మహేష్ కి పెట్టడము.... లేకపోతె మహేష్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గా కనిపిస్తాడని ప్రచారం జరిగింది కదా... దానికి సంబందించిన లుక్ ఏమన్నా చూపిస్తాడా అని ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్న అభిమానులకు  ఆ టైటిల్ ని మహేష్ లుక్ ని చూడగానే  వారు పెట్టుకున్న ఆశలన్నీపటాపంచలైపోయాయి. 

కేవలం ఒక గన్ పట్టుకుని నించున్న ఫోజులో మహేష్ లుక్ ని రివీల్ చేసి అందరి ఆసక్తి మీద మురుగదాస్ నీళ్లు చల్లాడు. అయితే ఈ లుక్ లో మహేష్ ఏమంత కొత్తగా కనబడడం లేదనే కామెంట్స్ పడుతున్నాయి. మరోపక్క సినిమా మీద ఉన్న అంచనాలు తగ్గించడానికి మురుగదాస్ ఇలా మహేష్ లుక్ ని సింపుల్ గా డిజైన్ చేసుంటాడనే  అనుమానం వ్యక్తం చేసేస్తున్నారు ఫ్యాన్స్. ఈ ఫస్ట్ లుక్ లో మహేష్ చాలా సింపుల్ గా గన్ పట్టుకుని స్టైలిష్ గా నించున్నాడు.  ఇక మహేష్ 'స్పైడర్' ఫస్ట్ లుక్ తోపాటు మోషన్ పోస్టర్ ని కూడా విడుదల చేశారు. ఇక మోషన్ పోస్టర్లో హరీష్ జైరాజ్ అందించిన మ్యూజిక్ అదిరిందనే చెప్పాలి. 

మరి ఒక్క ఫస్ట్ లుక్ కే ఇంత ఊరించిన మురుగదాస్ ఫస్ట్ లుక్ టీజర్ కోసం ఇంకెంత వెయిట్ చేయిస్తాడో అనే బెంగలో మహేష్ అభిమానులు ఉండడం కొసమెరుపు. ఇక ఈ చిత్రం అటు తమిళం ఇటు తెలుగులో తెరకెక్కుతుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ తెలుగులో ఈ రోజు బుధవారం ఫస్ట్ లుక్ ని విడుదల చేసిన చిత్ర యూనిట్ అక్కడ తమిళంలో ఈ నెల 14 న శుక్రవారం విడుదల చేస్తున్నట్లు సమాచారం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ