తాజాగా తమళస్టార్ ధనుష్‌పై వరుస వివాదాలు వస్తున్నాయి. సుచి లీక్స్ నుంచి ధనుష్ మా కొడుకు. కాబట్టి ముసలితనంలో తమకు కాస్త నెల నెల ఖర్చులకు ఇవ్వాలని ఓ ముసలి జంట కోరుతోంది. వారు ధనుష్ చిన్ననాటి ఫోటోను, పుట్టుమచ్చలను కూడా ఆధారంగా చూపిస్తున్నారు. ఇప్పటికే వారి మాటలను అత్యధికులు నమ్ముతున్నారు. ధనుష్ ఆ ముసలివారు చెప్పిన పుట్టుమచ్చలను లేజర్ చికిత్స ద్వారా తొలగించుకున్నాడని నిర్ధారణ అయింది.
ఇక తాజాగా ధనుష్‌కి డిఎన్‌ఏ టెస్ట్ చేయాలని కోర్టు భావించింది. కానీ ఇది తన ప్రైవసీకి భంగమని, తాను డీఎన్‌ఏ పరీక్షలు చేసుకోనని ధనుష్ వాదిస్తున్నాడు. ఇక పలువురు పెద్దల విషయంలో కూడా గతంలో ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. కొందరు తాము ఫలానా రాజకీయనాయకుడికి, గవర్నర్‌కు, ముఖ్యమంత్రికి.. ఇలా పెద్ద పెద్ద వారి కొడుకులమని, కోడళ్లమని, తల్లిదండ్రులమని వచ్చాయి. చాలా సార్లు అవి నిజమేనని కూడా తేలింది.
కాబట్టి ఎవరెవరో ఆరోపణలు చేస్తుంటే తాము ప్రతిసారి ఇలాంటి టెస్ట్‌లు చేయించుకోవాలా? ఇది తమ ప్రైవసీకి భంగమని భావించరాదు. ధనుష్ ఒక స్టార్ మాత్రమే కాదు.. మరో సెలబ్రిటీ కొడుకుగా చెబుతున్నాడు. దేశరాజకీయాలను, సినిమాలను శాసించే సూపర్‌స్టార్ రజనీకాంత్ అల్లుడు కూడా...! దానిని ధనుష్ మరువకూడదు.