ఒక్క చిత్రం హిట్టయితే చాలు మన హీరోలు పారితోషికాన్ని డబుల్ చేస్తారు. తమ హిట్ చిత్రం ఓవర్‌ఆల్‌గా ఎంత కలెక్ట్ చేసిందో అంత బడ్జెట్ పెట్టాల్సిందేనంటారు. ఇక ఫ్యాన్సీఆఫర్లు, రెమ్యూనరేషన్స్ ఇస్తే సినిమాలు చేస్తారు. ఇది డిమాండ్ అండ్ సప్లై సూత్రం కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవడం తప్పేమీ కాదు. కాగా వరస విజయాలతో దూసుకెళ్తున్న నేచురల్‌స్టార్ నాని మాత్రం తన పంధా వేరంటున్నాడు.
వరుసగా డబుల్ హ్యాట్రిక్‌లు వచ్చినా కూడా ఇప్పటికీ మొదటి చిత్రానికి చూపిన అంకితభావం, కథతో, క్యారెక్టర్‌లో కొత్తదనం చూస్తున్నాడు. కొత్త దర్శకులకు, హీరోయిన్లను నమ్ముకుంటున్నాడు. కానీ నిర్మాతలుగా మాత్రం దిల్‌రాజు, 14రీల్స్, దానయ్య, ఆర్కామీడియా వంటి వారికి సినిమాలు చేస్తూ మంచి ప్రమోషన్, థియేటర్లను సాధించడం వంటివి ఎంత ముఖ్యమో చాటుతున్నాడు. కాగా గత కొంతకాలంగా నాని తన రెమ్యూనరేషన్‌ను డబుల్ చేశాడని, ఇక చిన్న నిర్మాతలకు ఆయనతో వీలుకాదనే ప్రచారం జరిగింది.
కానీ నాని పెద్దగా, అంటే తన మార్కెట్‌కు తగ్గట్టుగా పెంచలేదు. యావరేజ్‌గా ఆడిన 'మజ్ను'చిత్రం కూడా 18కోట్ల వరకు వసూలు చేసింది. ఇక 'నేనులోకల్' అయితే 30కోట్లు దగ్గర ఆగింది. కానీ విచిత్రం ఏమిటంటే.. ఆయన ప్రస్తుతం దానయ్య బేనర్‌లో శివ నిర్వాణ అనే కొత్త దర్శకునితో 'నిన్ను కోరి' అనే చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని కూడా ఖర్చుకు వెనుకాడకుండా ఎక్కువశాతం షూటింగ్‌ను అమెరికాలో చేశారు.
ఈ చిత్రాన్ని ఎవరైనా బాగా క్యాష్ చేసుకోవాలనుకుంటారు. కానీ ఈ చిత్రం ఓవర్‌లాల్ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను కేవలం 15కోట్లలోపే అమ్మారని సమాచారం. సో.. ఈ చిత్రం ఎలా ఉన్నా కూడా ఖచ్చితంగా సేఫ్ చిత్రమే అవుతుంది.