Advertisementt

వావ్.... హ్యాట్సాఫ్‌ లారెన్స్‌..!

Wed 12th Apr 2017 06:30 PM
raghava lawrence,vishal,tamil nadu,chiranjeevi,nagarjuna,drance master lawrence  వావ్.... హ్యాట్సాఫ్‌ లారెన్స్‌..!
వావ్.... హ్యాట్సాఫ్‌ లారెన్స్‌..!
Advertisement
Ads by CJ

తెలుగువాడైన తమిళ హీరో నడిఘర్‌ సంఘంతో పాటు నిర్మాతల మండలిలో కూడా గెలిచి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇక తమిళంలో ఉన్న మరో రియల్‌ హీరో రాఘవలారెన్స్‌, గ్రూప్‌డ్యాన్సర్‌గా ఉన్న ఈయన్ను మెగాస్టార్‌ చిరంజీవి గుర్తించి బిజీ డ్యాన్స్‌ మాస్టర్‌ కావడంలో సహయం చేశాడు. ఇక ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న ఈయన రాఘవేంద్రస్వామిని నమ్ముకుని, నమ్మశక్యం కాకుండా ఆ వ్యాధి నయం కావడంతో రాఘవలారెన్స్‌గా పేరు మార్చుకున్నాడు. 

ఇక ఆయన్ను దర్శకునిగా, నటునిగా నిలబెట్టిన ఘనత నాగార్జునకు చెందుతుంది. మరోపక్క ఆయన తీసి, నటించిన 'స్టైల్‌' చిత్రంలో తమ శిష్యుడికి సాయంగా చిరు, నాగ్‌లు కామియో వేషాలేశారు. ఇక 'ముని'తో ఆయన ప్రభంజనం మొదలైంది. తెలుగులో కూడా ఆయన అనువాద చిత్రాలు నిర్మాతలకు బాగా లాభాలు తెచ్చిపెట్టాయి. ఇక చెన్నై వరదల్లో కోట్లు విరాళం ఇచ్చాడు. దివ్యాంగుల చేత సినిమాలలో డ్యాన్స్‌లు వేయించడమే కాదు.. వారికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా లారెన్స్‌ మారాడు. 

ఎందరో చిన్నారులకు ప్రమాదకర వ్యాధులతో బాధపడుతున్న వారికి ఆపరేషన్లు చేయిస్తున్నాడు. ఇక 'జల్లికట్టు' ఉద్యమంలో తానే స్వయంగా పాల్గొనడమే కాదు.. వారికి అన్నం, మంచి నీటి సదుపాయాలను, ముఖ్యంగా మహిళలకు టాయిలెట్ల కోసం తన కారవాన్‌లను ఏర్పాటు చేశాడు. ఇక 'కాంచన'తో హిజ్రాలపై ప్రేమను కురిపిస్తూ వారిని ఆదుకుంటున్నాడు. సినిమా విడుదలయ్యాక లాభాలలోంచి కొంతభాగం కేటాయించడం కాదు... సినిమా ప్రారంభమైన రోజునే తనకు వచ్చిన అడ్వాన్స్‌ రెమ్యూనరేషన్‌లోంచి హిజ్రాల సంక్షేమం కోసం నిధిలో వేస్తున్నాడు. తనకు అది సెంటిమెంట్‌గా మారిందని చెబుతూనే ప్రకృతి వెక్కిరిస్తున్న అలాంటి వారికోసం తాను బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారాడు. చిరు 150వ చిత్రం 'ఖైదీ'లోని పాటకు రెమ్యూనరేషన్‌కు బదులు సురేఖ వదిన ఇచ్చిన 'చిరు దోశలు' తిన్నాడు. హ్యాట్సాఫ్‌ లారెన్స్‌..! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ