మహేష్ బాబు టాలీవుడ్ టాప్ స్టార్ గా కొనసాగుతున్నాడు. మహేష్ చిత్రాలు ప్లాపైనా కూడా మహేష్ కున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గదు. మహేష్ సినిమా వస్తుంది అంటే ఆ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. ఒక్క సినిమాల్లోనే కాకుండా మహేష్ యాడ్స్ రంగంలో కూడా టాప్ పొజిషన్ లోనే వున్నాడు. మహేష్ చేతిలో ఉన్నన్ని యాడ్స్ మరే టాలీవుడ్ హీరో చేతిలో లేవు. ఒకప్పుడు మహేష్ బాబు సినిమా సినిమాకి గ్యాప్ తీసుకునేవాడు... కానీ ఈ మధ్య కాలంలో మహేష్ గ్యాప్ లేకుండా సినిమా షూటింగ్స్ చేస్తున్నాడు.
ఒకపక్క సినిమాలతో బిజీగా ఉంటూనే మరోపక్క ఫ్యామిలీకి టైమ్ స్పెండ్ చేస్తాడు మహేష్. అంత బిజీ బిజీ గా గడుపుతున్న మహేష్ ఇప్పుడు వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నాడని చెబుతున్నారు. ఇప్పటికే ప్రొడక్షన్ హౌస్ ని మొదలు పెట్టి సినిమా చేసిన మహేష్ ఇప్పుడు తాజాగా థియేటర్స్ బిజినెస్‌లోకి ఎంటర్ కావాలని ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. ఏషియన్ థియేటర్స్‌కి చెందిన సునీల్ నారంగ్‌తో మహేష్‌బాబు చర్చలు జరుపుతున్నట్టుగా టాలీవుడ్ లో టాక్ స్ప్రెడ్ అయ్యింది.
అటు ఆంధ్ర ఇటు తెలంగాణలోని ప్రధాన నగరాల్లో 25 థియేటర్స్ ని ఏర్పాటు చెయ్యాలని మహేష్ వారితో చర్చిస్తున్నట్టు చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని జిల్లా కేంద్రాల్లో ఈ థియేటర్లు నిర్మాణాన్ని చేపట్టాలని భావిస్తున్నట్టు ప్రచారం మొదలైంది. మురుగదాస్ తో సినిమా కంప్లీట్ అవ్వగానే మహేష్ ఈ థియేటర్స్ బిజినెస్ లోకి అడుగు పెడతాడని చెబుతున్నారు. ఇక మహేష్ ఒక పక్క సినిమాలు మరో పక్క యాడ్స్ ఇంకోపక్క థియేటర్స్ బిజినెస్ మరి మహేష్ ప్లానింగ్ మామములుగా లేదుగా అని అంటున్నారు.
ఇక మహేష్ మురుగదాస్ డైరెక్షన్ లో నటిస్తున్న చిత్ర ఫస్ట్ లుక్ ఈ రోజు బుధవారం సాయంత్రం 5 గంటలకు విడుదల కానుంది. ఈ చిత్రంలో మహేష్ కి జోడిగా రకుల్ ప్రీత్ నటిస్తుండగా తమిళ యాక్టర్ భారత్ కీ రోల్ లో నటిస్తున్నాడు.