Advertisementt

వావ్... చైతూ డేరింగ్‌ నిర్ణయం..!

Wed 12th Apr 2017 05:55 PM
naga chaitanya,samantha,nagarjuna,director kalyan krishna,rarandoy veduka cheddam movie  వావ్... చైతూ డేరింగ్‌ నిర్ణయం..!
వావ్... చైతూ డేరింగ్‌ నిర్ణయం..!
Advertisement
Ads by CJ

నాగచైతన్య ఆమద్య సమంతతో ప్రేమ, పెళ్లి విషయాలలో వార్తల్లోకి వచ్చాడు. ఆ తర్వాత ఆయన మలయాళ రీమేక్‌ 'ప్రేమమ్‌'తోపాటు గౌతమ్‌మీనన్‌ 'సాహసం శ్వాసగా సాగిపో' అనే రెండు చిత్రాలతో అతి కొద్ది గ్యాప్‌లోనే వచ్చాడు. ఇక ఈ రెండు చిత్రాలు నటునిగా నాగచైతన్యకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. కాగా ప్రస్తుతం నాగచైతన్య చాలా గ్యాప్‌ తీసుకున్నాడు. ఈసారి కూడా కిందటి సారిలానే వరుసగా రెండు చిత్రాలను కొద్దిగ్యాప్‌లోనే ప్రేక్షకులకు అందించనున్నాడు. 

కాగా ఆయన ప్రస్తుతం తన తండ్రి నాగార్జునకు 'సోగ్గాడే చిన్నినాయాన'తో బ్లాక్‌బస్టర్‌నిచ్చిన కొత్త దర్శకుడు కళ్యాణ్‌కృష్ణతో కలిసి తన తండ్రి నాగార్జున నిర్మాతగా, అన్నపూర్ణస్టూడియోస్‌ బేనర్‌లో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రానికి 'రారండోయ్‌ వేడుక చూద్దాం' అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసి ఫస్ట్‌లుక్స్‌గా రెండింటిని విడుదల చేశారు. ఒకటి మాస్‌ ప్రేక్షకులను, మరోటి క్లాస్‌ అండ్‌ ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రం చైతూకు ఓ 'నిన్నేపెళ్లాడతా'లా ట్రెండ్‌సెట్టర్‌ అవుతుందని భావిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో టాప్‌ హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌సింగ్‌ నటిస్తోంది. ఈ చిత్రాన్ని మే19న రిలీజ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. 

కాగా 'సాహసం శ్వాసగా సాగిపో' సమయంలోనే నిఖిల్‌ హీరోగా వచ్చిన 'ఎక్కడికి పోతావు చిన్నవాడా'చిత్రం వచ్చి విజయం సాధించింది. కాగా చైతూ-కళ్యాణ్‌కృష్ణల 'రారండోయ్‌ వేడుక చూద్దాం'కు ఓ వారం అటు ఇటుగానే నిఖిల్‌ నటించిన 'కేశవ'చిత్రం విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఇక మేనెల చైతుకుహీరోగా బాగా కలిసొచ్చింది. '100%లవ్‌, మనం, తడాఖా' చిత్రాలు కూడా అదే నెలలో విడుదలై ఘనవిజయం సాధించాయి. ఇక 'బాహుబలి-2' వంటి గట్టి పోటీ ఉన్నా కూడా చైతూ రేస్‌లోకి దిగి సమ్మర్‌ను, ఫ్యామిలీస్‌ను క్యాష్‌చేసుకోవాలనే డేరింగ్‌ నిర్ణయం తీసుకున్నాడు. ఇక ఆయన కొత్తదర్శకుడు కృష్ణతో చేస్తున్న థ్రిల్లర్‌ చిత్రం కూడా వేగంగా షూటింగ్‌జరుపుకుంటోంది. లావణ్యత్రిపాఠి నటిస్తున్న ఈ చిత్రం జులైలో విడుదలయ్యే అవకాశాలున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ