సంగీత దర్శకుడు థమన్.. ఈయన రాకతోనే సంచలనం సృష్టించాడు. చాలా త్వరిత గతిని ఎక్కువ చిత్రాలకు సంగీతం అందించిన సంగీత తరంగంగా పేరుతెచ్చుకున్నాడు. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోలను కూడా బుట్టలో వేసుకున్నాడు. వారికి సూపర్‌హిట్ సాంగ్స్‌ని అందించాడు. ఇక హీరోల సొంత గొంతులతో ఎక్కువగా పాడించే ట్రెండ్‌కు శ్రీకారం చుట్టాడు. ఒకానొక దశలో ఆయన దేవిశ్రీకి సైతం ఎదురొడ్డాడు. ఇక దేవిశ్రీ బిజీ కావడం. అనిరుద్, హైరీస్‌జైరాజ్ వంటి వారు తెలుగుపై దృష్టి పెట్టడంతో ఈయన రేసులో లేనట్లే కనిపిస్తున్నాడు.
కానీ ఎప్పుడు రేసులో లేనట్లు కనిపించే ఈ యువకుడు సినిమాల పరంగా మాత్రం ముందే ఉంటాడు. కాపీ క్యాట్ అనే పేరు తెచ్చుకున్నప్పటికీ పారితోషికం రీజనబుల్‌గా ఉండటం, పెద్దగా దర్శకనిర్మాతలను ఇబ్బందిపెట్టకపోవడం, అనుకున్న సమయానికి అవుట్‌పుట్ ఇవ్వడం అనేవి ఆయనకు వరమనే చెప్పాలి. ఇక ఆమద్య 'సరైనోడు, శ్రీరస్తు..శుభమస్తు' చిత్రాలకు మంచి సంగీతాన్నే అందించిన ఆయన తాజాగా సాయిధరమ్‌తేజ్ 'విన్నర్'కి సంగీతం అందించాడు. ఇక తాజాగా ఆయన చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి.
'జవాన్, గౌతమ్‌నందా, రాజుగారి గది2, భాగమతి, విక్రమ్ 'స్కెచ్' చిత్రాలకు సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈయన సురేందర్‌రెడ్డికి ఆస్థాన సంగీత దర్శకుడు కావడంతో చిరు హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో చేయబోయే 151వ చిత్రం కూడా ఆయనే చేయనున్నాడు. ఇక పవన్-నీసన్-ఎ.యం.రత్నం సినిమా పట్టాలెక్కితే దానికి కూడా థమన్ నే సంగీత దర్శకుడు కావడం ఖాయం. ఇక నితిన్ చిత్రంతో పాటు కోలీవుడ్‌స్టార్ విజయ్ చిత్రానికి కూడా ఆయన సంగీతం అందించనున్నాడు.