రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం అప్పుడే ఒక పాట చిత్రీకరణ జరుపుకుందని సమాచారం. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తుంది. రామ్ చరణ్ - సమంతలపై రాజమండ్రి పరిసర ప్రాంతాలలో ఒక పాట చిత్రీకరణ జరిపి మిగతా షూటింగ్ కూడా కొన్ని రోజుల పాటు అక్కడ ఆయా పల్లెటూర్లలోనే చిత్రీకరిస్తారని సమాచారం. ఈ చిత్రం పల్లెటూరి ప్రేమ కథగా ఉండబోతుందని... ఇందులో రామ్ చరణ్ చెవిటి వానిగా నటిస్తున్నాడని ప్రచారం జరుగుతుంది.
అంతేకాకుండా సమంత కూడా ఈ చిత్రంలో మూగ, కళ్ళు లేని పాత్రలో నటిస్తుందని సోషల్ మీడియాలో రకరకాల కథనాలు ప్రచారమవుతుండగా... ఈ ప్రచారానికి సుకుమార్ అండ్ టీమ్ చెక్ పెట్టింది. సమంత మూగ, అంధురాలి పాత్రలో చెయ్యడం లేదని తేల్చి చెప్పింది. ఇక రామ్ చరణ్ చెవిటివాడా? లేదా? అనే విషయాన్నీ మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కాకపోతే ఇంతవరకు ఎప్పుడూ చెయ్యని పాత్రలో కాస్త భిన్నంగా రామ్ చరణ్ కనిపిస్తాడని బయటికి వచ్చిన కొన్ని పిక్స్ ద్వారా తెలుస్తుంది.
ఇక మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు, ఆది పినిశెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు.