Advertisementt

జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్న సమంత..!

Wed 12th Apr 2017 03:22 PM
savitri movie,samantha,nag aswin,keerthi suresh,aswini dutt,suriya  జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్న సమంత..!
జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్న సమంత..!
Advertisement
Ads by CJ

ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కడ చూసిన మహానటి సావిత్రి బయో పిక్ గురించే మాట్లాడుకుంటున్నారు. మహానటి సావిత్రి బయో పిక్ ని తెరకెక్కిస్తానని 'ఎవడె సుబ్రహ్మణ్యం' దర్శకుడు, అశ్విని దత్ అల్లుడు నాగ్ అశ్విన్ చెప్పినప్పటినుండి... ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ ఎలా తెరకెక్కిస్తాడు అనే టాపిక్ మీద ఎడతెగని చర్చ మొదలైంది. ఇక 'మహానటి' పాత్రకు కీర్తి సురేష్ ని ఎంపిక చేసిన నాగ్ అశ్విన్ మరో కీలక పాత్ర కోసం సమంత ని సంప్రదించగా సమంత దీనికి ఒకే చెప్పేసింది. అయితే ఇప్పుడు 'మహానటి'లో సమంత మెయిన్ రోల్ కి కాకుండా మరో పాత్రకి ఎలా ఒప్పుకుంది... ఆమె చేసే రోల్ ఎలాంటిది అని సోషల్ మీడియాలో రక రకాల కథనాలు ప్రచారం అవుతున్నాయి.

సమంత 'మహానటి' చిత్రంలో .... సావిత్రి జీవితంలో అత్యంత ముఖ్యమైన జమున రోల్ పోషించనున్నట్లు కథనాలు వెలువడినాయి. కానీ ఇప్పుడు సమంత 'మహానటి' చిత్రంలో జర్నలిస్ట్ పాత్ర పోషిస్తున్నట్లుగా సమాచారం. జర్నలిస్ట్ గా సమంత, సావిత్రి జీవితం గురించి పరిశోధన చేసే పాత్రని నాగ్ అశ్విన్ డిజైన్ చేసినట్లు టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఆ పాత్ర అంతగా నచ్చడం వలెనే సమంత వెంటనే ఒప్పుకుందని అంటున్నారు. ఇకపోతే సావిత్రి జీవితంలో మరో ముఖ్యమైన వ్యక్తి  జెమిని గణేశన్ రోల్ కి తమిళ నటుడు సూర్య ని సంప్రదించినట్లు వార్తలొచ్చాయి. 

కానీ సూర్యకి అలాంటి కేరెక్టర్ లో కనిపించడం ఇష్టం లేక ఆ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించినట్లు చెబుతున్నారు. ఇక జెమిని గణేశన్ కేరెక్టర్ లో నటించేనటుడు కోసం నాగ్ అశ్విన్ వేటలో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఇంకొంతమంది నటీనటులు ఎంపిక తర్వాత 'మహానటి' చిత్రాన్ని పట్టాలెక్కిస్తారని సమాచారం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ