బాహుబలి సినిమా మొదలు కాకముందు నుండే రాజమౌళి ఫ్యామిలీ అంతా సినిమానే ప్రాణం అనుకునే స్టేజ్ లో వుంది. రాజమౌళి డైరెక్షన్ మొదలుపెట్టకముందునుండే రాజమౌళి కుటుంబం సభ్యులలో కొంతమంది సినిమాల్లో స్థిరపడ్డారు. అందులో సీనియర్ మోస్ట్ కీరవాణి చాన్నాళ్లపాటు సంగీత ప్రపంచాన్ని శాసించారు కూడా. ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ మంచి స్టోరీ రైటర్. ఇక రాజమౌళి సినిమాల్లో డైరెక్షన్ మొదలు పెట్టినప్పటినుండి ఆల్మోస్ట్ ఆయన ఫ్యామిలీ మెంబెర్స్ మొత్తం సినిమా రంగంలోకి వచ్చేసింది. కీరవాణి భార్య వల్లి లైన్ ప్రొడ్యూసర్ గా, రాజమౌళి భార్య రమ కాస్ట్యూమ్స్ డిజైనర్ గా, రాజమౌళి కొడుకు కార్తీక్ రాజమౌళికి కుడి భుజంగా... అలాగే రాజమౌళి కజిన్స్ ఇలా చాలామంది ఆ ఫ్యామిలీ నుండి సినిమా రంగంలో కష్టించి పనిచేసేవాళ్ళే.
ఇక వారి కష్టానికి ఫలితమే రాజమౌళి తెరకెక్కించిన చిత్రాలన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. మరి రాజమౌళి తన కుటుంబంతో పాటే ఇంతిలా కష్టపడుతుంటే మరోపక్క రాజమౌళి ఇండస్ట్రీలోని కొత్తవారెవరిని తమ టీమ్ లోకి తీసుకోకుండా అంతా ఫ్యామిలీ ప్యాకేజ్ లా వారికి వారే అవకాశాలు ఇచ్చేసుకుంటారని... కొందరు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి కొంతమందికి రామా రాజమౌళి గట్టిగా సమాధానం చెప్పింది. రమా రాజమౌళి ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాము పని చేతకానివాళ్ళని అందలమెక్కించడం లేదని... అసలు తమ వల్ల ఏదన్నా పొరపాటు జరిగితే అడగండి.. విమర్శించండి.... అంతేకాని... కష్టపడి పనిచెయ్యడమనేది మా బ్లడ్ లోనే ఉందని ఘాటుగా సమాధానమిచ్చింది.
అసలు మేము కష్టపడినట్లు ఎవరూ కష్టపడి పనిచెయ్యరని... తమకి అన్ని పనులు చక్కబెట్టుకునే సమర్ధత ఉందని... మేము దాదాపు 20 గంటలు ఈ ఫీల్డ్ లో నిలబడి పనిచెయ్యగలమని... గత నాలుగున్నరేళ్ళగా బాహుబలి కోసం మా కుటుంబం అంతా కష్టపడుతుందని... ఇది మా ప్రాజెక్ట్ అనుకోబట్టే మంచి అవుట్ ఫుట్ ఇవ్వగలుగుతున్నామని ఘాటుగా స్పందించింది.