Advertisementt

'గౌతమ్‌ నందా'కు ఈ రెండు హైలెట్స్‌....!

Tue 11th Apr 2017 07:48 PM
gopichand,gautham nanda,skydrive,hansika,action scene  'గౌతమ్‌ నందా'కు ఈ రెండు హైలెట్స్‌....!
'గౌతమ్‌ నందా'కు ఈ రెండు హైలెట్స్‌....!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం గోపీచంద్‌ హీరోగా సంపత్‌నంది దర్శకత్వంలో 'గౌతమ్‌ నందా' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. థమన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో హన్సిక, కేధరిన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈచిత్రం షూటింగ్‌ చివరి దశకు వచ్చింది. ఈ వేసవిలోనే చిత్రాన్ని విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. చాలా గ్యాప్‌ తర్వాత వస్తున్న గోపీచంద్‌ చిత్రం కావడం అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

ఈ చిత్రంలోని ఓ యాక్షన్‌ ఫైట్‌ను కేవలం మూడే మూడు నిమిషాలలో చిత్రీకరించిన సంగతి తెలిసిందే. ఈ యాక్షన్‌ ఫైట్‌ చిత్రానికి ఓ హైలైట్‌ కానుందని అంటున్నారు. మరోపక్క ఈ చిత్రంలోని పాటను దుబాయ్‌లో చిత్రీకరిస్తున్నారు. ఈపాటలో గోపీచంద్‌ తానే స్వయంగా ఓ సాహసం చేశాడట. ఆయన ఏకంగా పూర్థిస్థాయి స్కై డ్రైవింగ్‌ చేశాడు. ఇది ఎంతో ప్రమాదకరమైనప్పటికీ దీనిని గోపీచంద్‌ ఎంతో సాహసోపేతంగా చేయడంపై  ప్రశంసల వర్షం కురుస్తోంది. త్వరలో ఈ చిత్రం ఆడియో వేడుక తేదీని ప్రకటించనున్నారు

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ